Karnataka Hijab Row: అంతర్జాతీయ స్థాయికి హిజాబ్ ఇష్యూ.. అగ్రరాజ్యం అమెరికా ఏమన్నదంటే..?
Hijab Issue to International level: ఆరుగురు విద్యార్థుల ఇష్యూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇప్పుడు సరిహద్దులు దాటేసి,
Hijab Issue to International level: ఆరుగురు విద్యార్థుల ఇష్యూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇప్పుడు సరిహద్దులు దాటేసి, అంతర్జాతీయ హద్దుల్లోకి వెళ్ళడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హిజాబ్ ఇష్యూ. కర్నాటకలోని ఉడుపిలోని ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ వస్త్రధారణ విషయంలో తలెత్తిన వివాదం యిప్పుడు యావత్ సమాజాన్ని అట్టుడికిస్తోంది. ఓ వైపు హిజాబ్ ( hijab issue) అనుకూల, మరోవైపు ప్రతికూల ఆందోళనలతో పీక్స్‌కి చేరింది హిజాబ్ కాంట్రవర్సీ. కర్నాటక హిజాబ్ (Karnataka hijab issue) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు కళాశాల ప్రాంగణాలకూ, విద్యాలయాలకూ పరిమితమైన ఇష్యూ యావత్ దేశంలోప్రకంపనలు సృష్టిస్తోంది. కర్నాటకలో దేవణగెరేలో జరిగిన హింసాత్మక ఘటన యావత్ సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఏకంగా ఓ నిండు ప్రాణాన్నే హిజాబ్ ఇష్యూ బలిగొన్న ఘటన కర్నాటకలో కాక రేపుతోంది. సోషల్ మీడియా పోస్ట్ ఓ వ్యక్తి మరణానికి కారణమవడమే కాదు, వృద్ధురాలైన అతని తల్లిని సైతం తీవ్రగాయాల పాలు చేసీన విషాద ఘటనకు కర్నాటక సాక్ష్యంగా నిలిచింది.
వాట్సాప్‌లో హిజాబ్ ఇష్యూ వ్యతిరేక కామెంట్స్ చేశారన్న కారణంగా ఓ తల్లీ కొడుకులపై హిజాబ్ అనుకూల వర్గం తీవ్రంగా దాడిచేయడంతో ఓ నవ యువకుడు మృత్యువాత పడిన ఘటన ఇప్పుడు కర్నాటకకే కాదు, ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది. దావనెగెణె జిల్లాలోని మాలెబెన్నూర్ పట్టణంలో ఓ దుకాణం నడుపుకుంటోన్న దిలీప్ మాలగిమనే అనే యువకుడు వాట్సాప్ స్టేటస్ గా హిజాబ్ ఇష్యూని పెట్టుకోవడం వివాదానికి దారితీసింది. ఆ యువకుడిపైనా, అతడి తల్లిపైనా హిజాబ్ అనుకూల వర్గం మూకుమ్మడిగా దాడికి దిగింది. ఆ యువకుడిని విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో యువకుడు మరణించడం ఇప్పుడు హిజాబ్ ఇష్యూని ఆ రాష్ట్రవ్యాప్తంగా హీటెక్కిస్తోంది. ఈ ఘటనలో పోలీసులపై సైతం దాడి జరగడం మరింత ఉద్రక్తంగా మారింది.
మరో వైపు కర్నాటకలోనే కాకుండా, ఏపీ, తెలంగాణల్లో సైతం హిజాబ్ అనుకూల ప్రదర్శనలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్, అనంతపురంలో ముస్లిం యువతులు వీధుల్లోకొచ్చి హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు. ఇంకో వైపు కర్నాటకలోని అంకుట్టక్కడ్ ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం విద్యార్థినులు ప్రార్థనలకు దిగడంతో హిజాబ్ కాంట్రవర్సీని కార్చిచ్చులా మార్చింది. అంకుట్టక్కడ్ ప్రభుత్వ పాఠశాలలో గత మూడు వారాలుగా విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండడం మరో సరికొత్త వివాదానికి తెరతీసింది.
ఒకవైపు హిజాబ్ వివాదం అంతర్జాతీయంగా వివాదాస్పందగా మారిన సందర్భంలో సర్కార్ బడిలో ఇలా ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపిస్తోంది స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మానిటరింగ్ కమిటీ. కర్నాటక స్టేట్ ఇష్యూ కాస్తా ఇంటర్నేషనల్ ఇష్యూగా మారడం ఇప్పుడు యావత్ దేశాన్ని అట్టుడికిస్తోంది. హిజాబ్ పై తాజాగా యూఎస్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం స్పందిస్తూ ఇది మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని, బాలికల హక్కులకు భంగకరమని వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రతిస్పందించింది.
ఈ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఓ ప్రకటన చేస్తూ ఇది మా ఇంటర్నల్ ఇష్యూ అని స్పష్టం చేశారు. ‘డ్రెస్‌కోడ్ వివాదాన్ని కర్నాటక ఉన్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. మా రాజ్యాంగ విధివిధానాలు, ప్రజాస్వామ్య నియమాలకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే భారత అంతర్గత వ్యవహారాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎన్నటికీ స్వాగతించబోం’ అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?
మరోవైపు హిజాబ్ ఇష్యూపై అత్యవసర పిటిషన్‌కి సుప్రీంకోర్టు నో చెప్పింది. ఓ వైపు కర్నాటక హైకోర్టులో వివాదం కొనసాగుతున్న సందర్భంలో హిజాబ్ విషయంలో జోక్యం తగదని తేల్చి చెప్పారు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ. మరోవైపు ఈనెల 16 నుంచి విద్యాసంస్థలను కర్నాటకలో తిరిగి ప్రారంభించనున్నారు. తుది తీర్పు వెల్లడించే వరకు ఎటువంటి మతాచారాలకు సంబంధించిన దుస్తులనూ విద్యాసంస్థల్లో ధరించరాదంటూ కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అలాగే డ్రెస్‌కోడ్‌పై ఎవరినీ బలవంతం చేయొద్దని ఆదేశాలు జారీచేయడంతో విద్యాసంస్థలు తెరుచుకోవడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
Also Read: