Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab: హిజాబ్ మా దేశ అంతర్గత అంశం – మీ కామెంట్లు సరికాదు.. కేంద్రం కీలక వ్యాఖ్య

కర్ణాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్(Hijab) వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతే గాక అంతర్జాతీయంగా చర్చకూ దారి తీసింది. ఇటీవల కొందరు విదేశీ...

Hijab: హిజాబ్ మా దేశ అంతర్గత అంశం - మీ కామెంట్లు సరికాదు.. కేంద్రం కీలక వ్యాఖ్య
Bagchi
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 12, 2022 | 2:07 PM

కర్ణాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్(Hijab) వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతే గాక అంతర్జాతీయంగా చర్చకూ దారి తీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో పాటు కొన్ని దేశాలు కూడా ఈ అంశంపై స్పందించాయి. దీంతో వీరి వ్యవహార తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ అంతర్గత విషయాలపై రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేయడం సరికాదని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘కర్ణాటకలోని కొన్ని విద్యాసంస్థలో డ్రెస్‌కోడ్‌ అంశాన్ని ప్రస్తుతం కర్ణాటక ఉన్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. మా రాజ్యాంగ విధివిధానాలు, ప్రజాస్వామ్య నియమాలకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత్‌ గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటారు. అయితే మా దేశ అంతర్గత సమస్యలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎన్నటికీ స్వాగతించబోం’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై తుది తీర్పు వెల్లడించే వరకు సంప్రదాయ వస్త్రాలతో విద్యా సంస్థలకు హాజరుకారాదని గురువారం మౌఖిక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం లిఖితపూర్వక ప్రతిని విడుదల చేసింది. తరగతులకు హిజాబ్‌ ధరించి హాజరవటం రాజ్యాంగం కల్పించిన అనివార్య వస్త్రధారణ పరిధిలోనికి వస్తుందా? రాదా? అన్న అంశంపై లోతైన అధ్యయనం అవసరమన్న ఉన్నత న్యాయస్థానం.. దీనిపై ఇతర కోర్టుల తీర్పులను పరిశీలించాలని పేర్కొంది. అప్పటిదాకా సాధారణ పరిస్థితుల్లో తరగతులు నిర్వహించే వాతావరణాన్ని కర్ణాటక ప్రభుత్వం కల్పించాలని సూచించింది.

Also Read

Punjab Elections: పంజాబ్ జంపింగ్ జపాంగ్.. కేవలం 39 రోజుల్లో మూడు సార్లు పార్టీ మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్

Diabetic Patient: షుగర్ ఉన్నవారు బీట్‌రూట్ తింటే బెటర్.. ఈ 4 సమస్యలకి చక్కటి పరిష్కారం..

V. Hanumantha Rao: కర్నూలులో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.. కారణమేంటంటే..