Knowledge: కోవిడ్ వ్యాక్సిన్ ఎంత మందికి ఇచ్చారు.. దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా..
దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సినేషన్(Covid Vaccination) కవరేజీ 172.29 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ(Central Health Ministry) శాఖ శనివారం తెలిపింది....
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఓ క్రతువులా కొనసాగుతోంది. కేవలం గత 24 గంటల్లో 46.82 లక్షల (46,82,662) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్(Covid Vaccination) కవరేజీ 172.29 కోట్ల డోసులకు చేరుకుందని పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలకు 1,03,99,129 మొదటి డోసు(First Dose) ఇవ్వగా.. 99,25,930 మందికి రెండో డోసులు ఇచ్చామని తెలిపింది. 38,43,355 మంది ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసులు కూడా అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోవిడ్ వ్యాక్సినేషన్‌కు 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు రూ.27,945.14 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఆ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ పార్లమెంట్‌కు తెలిపారు. వ్యాక్సినేషన్‌కు 2022-23 బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌తో దేశవ్యాప్తంగా 13 మంది పాలిచ్చే తల్లులపై స్వల్ప ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొన్నారు. అందులో ఒక కేసు తెలంగాణలో నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వివరించారు.
నిపుణుల బృందం నుంచి సిఫార్సులు అందిన వెంటనే 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. పిల్లలకు టీకా ఇవ్వడంపై నిపుణుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి సిఫారసు చేయలేదని ఆయన అన్నారు. శాస్త్రవేత్తల బృందం సిఫార్సు ఆధారంగా టీకాలు ఎప్పుడు వేయాలి, ఏ వయస్సు వారికి వేయాలో నిర్ణయిస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు COVID-19 టీకాలు వేయడం గత నెలలో ప్రారంభమైంది.
కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు..
#Unite2FightCorona #IndiaFightsCorona #OmicronVariant #LargestVaccineDrive@PMOIndia @mansukhmandviya @ianuragthakur @DrBharatippawar @PIB_India @mygovindia @COVIDNewsByMIB @ICMRDELHI @DDNewslive @airnewsalerts @AmritMahotsav pic.twitter.com/SKu6Dcd7hC
— Ministry of Health (@MoHFW_INDIA) February 12, 2022
Read Also.. India Corona: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 50,407 మందికి పాజిటివ్, 804మంది మృతి