Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Elections: పంజాబ్ జంపింగ్ జపాంగ్.. కేవలం 39 రోజుల్లో మూడు సార్లు పార్టీ మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్

పంజాబ్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హరగోవింద్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ మరోసారి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీతో విడిపోయిన తర్వాత లాడి గత నెల జనవరి 3న కాంగ్రెస్‌లో చేరారు.

Punjab Elections: పంజాబ్ జంపింగ్ జపాంగ్.. కేవలం 39 రోజుల్లో మూడు సార్లు పార్టీ మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్
Balwinder Singh Laddi
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 12, 2022 | 1:48 PM

Punjab Assembly Election 2022: పంజాబ్ కాంగ్రెస్‌ పార్టీ(Congress)కి చెందిన హరగోవింద్‌పూర్(Haragovindpur) సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ(Balwinder Singh Laddi) మరోసారి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీతో విడిపోయిన తర్వాత లాడి గత నెల జనవరి 3న కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కేవలం 39 రోజుల తర్వాత, బల్వీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడి తిరిగి బీజేపీలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బటాలాలో లాడిని తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సమయంలో బటాలా నుండి బీజేపీ అభ్యర్థి ఫతేజంగ్ బజ్వా కూడా ఉన్నారు.

బల్వీందర్ సింగ్ లాడీ, భాజ్వాతో కలిసి కాంగ్రెస్‌ను వీడి గతేడాది డిసెంబర్ 28న బీజేపీలో చేరారు. బజ్వా పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా తమ్ముడు. కాషాయ పార్టీలో చేరిన ఆరు రోజుల తర్వాత లాడి జనవరి 3న తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమక్షంలో ఆయన అధికార పార్టీలో చేరారు.

ఇదిలావుంటే, గురుదాస్‌పూర్ జిల్లాలోని హరగోవింద్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి లాడికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ సీటులో లాడీకి బదులుగా మన్‌దీప్‌ సింగ్‌ను పార్టీ బరిలోకి దింపింది. ఇది బల్వీందర్ సింగ్ అసంతృప్తికి కారణం, ఆ తర్వాత అతను తిరిగి బీజేపీలోకి వచ్చారు. మళ్లీ పార్టీలో చేరిన తర్వాత.. ‘‘కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే మళ్లీ బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్‌లో చేరి పెద్ద తప్పు చేశానని బల్వీందర్ సింగ్ తెలిపారు. బీజేపీలోకి తిరిగి రావాలని ఫతే జంగ్ పట్టుబట్టారు. కాంగ్రెస్ నాకు ఇవ్వడానికి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. నేను కూడా పార్టీకి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి, నేను విడిపోయాను. బీజేపీ జాతీయ పార్టీ, దాని సిద్ధాంతాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. అందుకే కాషాయం కండువా కప్పుకున్నానని ఆయన వెల్లడిచారు.

మరోవైపు, రాజ్యసభ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ఎమ్మెల్యే భాయ్ ఫతే సింగ్ బజ్వా, ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లాడి డిసెంబర్ 28న బీజేపీలో చేరారు. వీరితో పాటు క్రికెటర్ దినేష్ మోంగియా కూడా చండీగఢ్‌లో బీజేపీలో చేరారు. అదే సమయంలో, గుర్తేజ్ గుధియాన్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీలోని ఈ నేతలందరికీ పార్టీ సభ్యత్వం ఇప్పించారు.

Read Also… UP Elections: ఎన్నికల పోలింగ్‌కు రెండే రోజులు.. పార్టీ మారిన అభ్యర్థి.. కాంగ్రెస్ వీడి.. సమాజ్ వాదీ పార్టీలో చేరిన సలీం ఖాన్