Telugu Heroine: లక్కంటే ఈ బ్యూటీదే.. వాసెలిన్ యాడ్ చేసి హీరోయిన్ అయ్యింది.. తెలుగులో క్రేజీ ఫాలోయింగ్..
స్కూల్లో టాపర్.. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే తెలుగులో క్రేజీ హీరోయిన్ అయ్యింది. చిన్నప్పుడు వాసెలిన్ యాడ్ చేసి బుల్లితెరపై మెరిసింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సంచలనం సృష్టించింది. వరుస సినిమాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ డమ్ మాత్రం రాలేదు. చిన్నప్పటి నుంచి IAS కావాలని ఎన్నో కలలు కన్నది. అందుకోసం చదువుల్లో ముందుండేది. 12వ తరగతిలో ఆమె టాపర్. కానీ ఆ తర్వాత నెమ్మదిగా నటనపై ఆసక్తి ఏర్పడింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ తెగ వైరలయ్యింది. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనే హీరోయిన్ రాశీ ఖన్నా.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు గెలుచుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో యంగ్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇన్నాళ్లు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలో బిజీగా మారిపోయింది.
హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. నిజానికి ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ మూవీ చేసింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఇటీవలే అరణ్మనై 4 సినిమాతో హిట్ అందుకుంది. అలాగే ది సబర్మతి రోపోర్ట్ మూవీతో హిందీ ప్రేక్షకులను అలరించింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..