Chhaava: ఛావాకు అరుదైన గౌరవం! ఏకంగా పార్లమెంట్‌లో స్పెషల్ షో…!
బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఛావా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ఒక మంచి సినిమా విజయం కోసం ఎదురు చూస్తోన్న బాలీవుడ్ కు ఛావా ఊపిరిపోసింది. నార్త్ ఇండియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. రిపీటెడ్ గా థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా ఇక్కడ కూడా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ పీరియాడికల్ మూవీకి అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఛావా సినిమాను పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని భావిస్తున్నట్లు సమాచారం. మార్చి 27న పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలో ఛావా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించేందుకు ప్రధాన మంత్రి న నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుకానున్నారట. అలాగే విక్కీ కౌశల్, రష్మికతో సహా చిత్ర బృందం మొత్తం ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రూ.175 కోట్లు.. లాభాల్లో 20% వాటా.. డబ్బులు దగ్గర నో తగ్గుడు!
తండ్రిని పట్టుకుని ఎమోషనల్.. అమీర్‌ఖాన్ కూతురుకు ఏమైంది ??
ఫ్యాన్స్ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్