Manchu Lakshmi: ఓ ఫ్యామిలీని బాధపెట్టారు.. క్షమాపణలు చెప్పాల్సిందే..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిపై పలు సంచలన ఆరోపణలు వచ్చాయి . ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పుడు తన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో రియా చక్రవర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణంలో రియా చక్రవర్తికి ఎలాంటి పాత్రా లేదని కరాఖండిగా చెప్పేశారు.
దీంతో రియాకు భారీ ఊరట లభించినట్లయింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరూ కూడా రియా విషయంలో ఎంతో సంతోషంగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తిని ఉద్దేశించి టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. సుశాంత్ డెత్ కేసులో ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని, పోరాటాన్ని గుర్తు చేస్తూ మంచు వారమ్మాయి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. “సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో రియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నాకు ముందుగానే తెలుసు. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగదు.. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. ఈ విషయంలో రియా, ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే, మీతో క్రూరంగా రాక్షసంగా ప్రవర్తిస్తుంటే రియా పోరాడిన విధానం నిజంగా అద్భుతం. మిమ్మల్ని అవమానించారు, చీల్చి చెండాడారు. అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు. ముందుకు సాగారు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఇప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రూ.175 కోట్లు.. లాభాల్లో 20% వాటా.. డబ్బులు దగ్గర నో తగ్గుడు!
తండ్రిని పట్టుకుని ఎమోషనల్.. అమీర్‌ఖాన్ కూతురుకు ఏమైంది ??
ఫ్యాన్స్ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

