ఫ్యాన్స్ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్! హిందీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హిందీలో ఫేమస్ అయిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు జడ్జీగా వ్యవహరించి మరింత ఫేమస్ అయింది. షోలలో జడ్జిమెంట్ ఇస్తూ ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో ఆమె కావాలని డ్రామా చేస్తుందని నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు.
ఇక ఈ విషయం కాసేపు పక్కకుపెడితే.. తాజాగా ఆమె తీరుపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వేదికపైనే బోరున ఏడ్చేసింది ఈ బ్యూటీ. ఇటీవల మెల్‌బోర్న్‌లో సింగర్ నేహా కక్కర్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కచేరీకి నేహా కక్కర్ గంట కాదు.. ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. సాయంత్రం ఏడున్నరకు ప్రోగ్రాంకు రావాల్సి ఉండగా.. నేహా కక్కర్ ఏకంగా మూడు ఆలస్యంగా వచ్చి కేవలం గంట పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ కొని ఆమె షో కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్టేజ్ పై నేహా కక్కర్ పాటలు పాడుతుండగానే.. గో బ్యాక్.. హోటల్ కు వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ అరుస్తూ సీరియస్ అయ్యారు. దీంతో ఏం చేయాలో తెలీక స్టేజీపైనే బోరున ఏడ్చేసింది. ఏడ్వవడమే కాదు.. నేహా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుడంగా అభిమానులు మరింత ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిస్తున్న పిచ్చుకలు.. వినాశనం తప్పదా..?
వేసవిలో ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు.. అందం మీ సొంతం
హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు.. ఎలా మాయం అయింది.. మళ్లీ ఎలా వచ్చింది ?
క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు