దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్ వీడియో
దుబాయ్ అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్న బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 తో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఓ మూవీ లైన్‌లో ఉంది. పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ రెండూ క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
మరిన్నివీడియోల కోసం:
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో
గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!