భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరు రోజుల పాటు..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌లో మర్చంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ఇంట్రెస్టింగ్ అంశాలు బయటకు వచ్చాయి. హత్య తర్వాత తమ కదలికలను ఎవ్వరూ గుర్తించకుండా భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు భార్యా భర్తలుగా చెప్పుకుని ఆరు రోజులు హిమాచల్‌ప్రదేశ్ కసోల్‌లోని ఓ హోటల్‌లో గడిపినట్లు తెలిసింది. ప్రియుడు సాహిల్‌తో కలిసి భర్త సౌరభ్ శుక్లాను మార్చి 4న ముస్కాన్ హత్య చేసింది. మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టింది.
మృతదేహాన్ని ముక్కలుగా నరికి, డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో సీల్ చేశారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. భార్యా భర్తలుగా చెప్పుకుని కసోల్‌లోని ఓ హోటల్‌లో మార్చి 10న దిగారు. అక్కడే ఆరు రోజులు ఉండి 16వ తేదీన వెళ్లిపోయారు. వారితోపాటు ఓ డ్రైవర్ కూడా ఉన్నట్లు హోటల్ యజమాని పోలీసులకు తెలిపాడు. సాధారణంగా హిమాచల్‌కు వచ్చే టూరిస్టులు కొత్త ప్రదేశాలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు కానీ, ఈ జంట మాత్రం రోజు మొత్తం హోటల్‌లోనే గడిపారని, కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లేవారని హోటల్ యజమాని అన్నాడు. అలా చేయడం అసాధారణంగానే అనిపించిందని, కనీసం రూమ్ శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా గది లోకి రానివ్వలేదని చెప్పాడు. హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు.. తాము మనాలీ నుంచి వచ్చామని, యూపీకి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం :
క్యాబ్ ఖర్చుతోనే గాల్లో ప్రయాణం.. ఎయిర్ ట్యాక్సీ మేడ్ ఇన్ గుంటూరు
పాములు వాళ్లపైనే.. ఎందుకు పగ పడుతున్నాయి?
అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్‌ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
