Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములు వాళ్లపైనే.. ఎందుకు పగ పడుతున్నాయి?

పాములు వాళ్లపైనే.. ఎందుకు పగ పడుతున్నాయి?

Samatha J

|

Updated on: Mar 24, 2025 | 3:30 PM

లక్షల ఏళ్ల నుంచి భూమ్మీద సంచరిస్తున్న పాములు.. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. కొంతమందేమో చాలా సార్లు పాము కాట్లకు గురి అవుతున్నారు. పాములు వారిపైనే పగబట్టినట్టుగా కాటేయడాన్ని చూస్తున్నారు. చిత్తూరులో అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. ఇక కర్నాటకలో ఓ కుటుంబాన్ని 25 ఏళ్లుగా పాములు టార్గెట్‌ చేసాయి. నాలుగేళ్లకోసారి కాటు వేస్తూ ఆ కుటుంబంలోని మగవారిని చంపేస్తున్నాయి.

మరోవైపు చూస్తే.. వెయ్యి పాముల్ని పట్టుకుందో స్నేక్‌ యువతి. ఇలా పాముల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఓసారి చూస్తే.. పాముల గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి.ఆ కుటుంబాన్ని 25 ఏళ్లుగా పాములు వెంటాడుతున్నాయి. కుటుంబంలోని మగవారిని మాత్రమే పాములు కరవడం, పొలం పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఒకేచోట ప్రమాదం జరగడంతో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక తుమకూరు జిల్లాలోని తొగరిఘట్ట గ్రామానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబానికి ఎదురైన విషాదమిది. గత 25 ఏళ్లలో ఆ కుటుంబానికి చెందిన 12 మంది పాముకాటుకు గురయ్యారు. కుటుంబ పెద్ద ధర్మన్న పాముకాటుతో మృతిచెందారు. ఆ తరువాత హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్‌ ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కుటుంబంలోని గోవిందరాజు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.