వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
హైదరాబాద్‌లో హలీం ఓ సంస్కృతిగా మారిందని చెప్పొచ్చు. రంజాన్ సీజన్‌లో దీనికి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఈ సీజన్‌లో హలీం టాప్ స్పాట్‌గా ఎన్నో రెస్టారెంట్లు పేర్లను హైదరాబాద్‌లో చెప్పేయవచ్చు . హలీం తినడానికి ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో జనం వస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా ఈ హోటల్స్ ఫేమస్ అయ్యాయి. అంతే కాదు.. ఇక్కడి రుచి కూడా తిన్నవారిని మైపరిపిస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం హలీమ్ తినకూడదు ! హైదరాబాద్‌లో రంజాన్ సంబరాలు హలీం లేకుండా పూర్తవ్వవు. ప్రతి సంవత్సరం.. హలీం ప్రియులు ఏ హోటల్‌లో హలీం బెస్ట్ అన్నదానిపై చర్చించుకుంటారు.
ప్రసిద్ధ హోటళ్లతో పాటు కొత్తగా వచ్చిన హలీం కేంద్రాలు కూడా తమ ప్రత్యేకతతో ఆకట్టుకునేందుకు పోటీ పడతాయి. సాంప్రదాయ భట్టి హలీం నుంచి మోడర్న్ వేరియంట్స్ వరకు.. హైదరాబాద్‌లో హలీంపై ఇష్టం రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని హోటల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హలీం కోసం ప్రజలు గంటల తరబడి హోటళ్ళ ముందు క్యూలో నిల్చోవడానికి ఆలోచించరు. అంతేకాదు హలీం రీల్స్, వీడియోలతో ఈ హోటల్స్ రాత్రికి రాత్రే ఫేమ్ సంపాదిస్తున్నాయి. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ముస్లింలు రోజా ఉపవాసాలు ప్రారంభించారు. ఇక రంజాన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముందుగా ఈ హలీం ను ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఇరాన్ దేశంలో ప్రారంభించారు. ఇది క్రమంగా ఇరాన్ దేశం నుంచి నేడు భారతదేశానికి పాకింది. దీంతో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం హలీం వ్యాపించి హిందూ, ముస్లింలను తన వద్దకు రప్పించుకుంటుంది. చెప్పాలంటే ముస్లిం సోదరుల కంటే కూడా హిందువులే హలీం రుచులకు ఎంతో ఆకర్షితులవుతున్నారు. దీంతో మార్కెట్‌ల్లో హలీం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అయితే నోరూరించే హలీంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా చేస్తాయి. కానీ కొంత మంది మాత్రం ఈ హలీం జోలికి పోకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!
పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు
హడలెత్తిస్తున్న పులి.. వణికిపోతున్న రైతులు
బీరు సీసా 'గంట'.. రామచిలుకలకు 'టాటా'
ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్ డెలివరీ .. అరుదైన ఘటన

