గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
గ్రోక్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రూపొందించిన ఈ ఏఐ టూల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెప్పే గ్రోక్.. కొన్ని విషయాల్లో మాత్రం తప్పు జవాబులు, మరికొన్నిసార్లు వివాదాస్పద కామెంట్లు చేస్తోంది. ఇలా టాక్ ఆఫ్ ది ఎక్స్‌గా మారిన గ్రోక్.. ఇప్పుడు ఒక ప్రముఖ డైరెక్టర్ కు సారీ చెప్పింది.గ్రోక్ క్షమాపణ చెప్పిన డైరెక్టర్ మరెవరో కాదు.. కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రోక్.. ఫేక్ వార్తలు సృష్టించే వ్యక్తుల జాబితాలో వివేక్ పేరును పెట్టింది.
ఈ విషయం వివేక్కు తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అలాంటి కామెంట్స్ చేసినందుకు వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గ్రోక్.. వివేక్ అగ్నిహోత్రికి క్షమాపణలు చెప్పింది. తాను చేసింది ఘోరమైన తప్పేకాక, బాధ్యతారాహిత్యమైందని వివరణ ఇచ్చింది. కొన్ని సోర్స్ ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వివేక్ పేరు ఆ లిస్టులో చేరిందని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పింది. ఇకపై వాస్తవాల ఆధారంగానే సమాధానాలు ఇస్తామన్న గ్రోక్.. ఎవరి ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు చేయనని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే డైరెక్టర్కు గ్రోక్ సారీ చెప్పడంపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఏఐతో క్షమాపణ చెప్పించుకున్న మొదటి వ్యక్తిగా వివేక్ అగ్నిహోత్రి నిలిచారని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
క్యాబ్ ఖర్చుతోనే గాల్లో ప్రయాణం.. ఎయిర్ ట్యాక్సీ మేడ్ ఇన్ గుంటూరు
పాములు వాళ్లపైనే.. ఎందుకు పగ పడుతున్నాయి?
అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
