రైల్వే స్టేషన్‌లో చాట్ అమ్ముకుంటున్న అదానీ సోదరుడు
సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌కు కొదవే లేదు. ప్రతిరోజూ ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని ఆందోళన కలిగిస్తాయి.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అపర కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ సమీపంలో చాట్ అమ్ముతున్నాడనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
అతను చాట్ అమ్ముతున్న వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్న బిలియనీర్, తమ్ముడు ఇలా రోడ్డు పక్కన చాట్ వ్యాపారి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతను నిజంగా అదానీ తమ్ముడు కాదండి బాబు.. అదానీకి అతనికి దగ్గరి పోలికలు ఉండటంతో ఎవరో వీడియో తీసి సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. గౌతమ్ అదానీ సోదరుడు చాట్ అమ్ముకుంటున్నాడంటూ క్యాప్షన్ ఇవ్వడంతో వీడియో వైరల్‌గా మారింది. గౌతమ్ అదానీలా కనిపిస్తున్న ఈ వ్యక్తి..ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ వద్ద చాట్ అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి. ఇతనికీ గౌతమ్ అదానీకి ఎటువంటి సంబంధం లేదు. గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ అనే విషయం అందరికీ తెలిసిందే. వివిధ రకాల వ్యాపారాలతో అతి తక్కువ కాలంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన అదానీ గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు. దాంతో ఆయనలా ఓ వ్యక్తి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు ?? ఆ మంత్రగాడు మాత్రం ఎలా ఎక్కాడు?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
