ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఓ మహిళా రైతు పండించిన మామిడిపండు ఒక్కోటి రూ. 10 వేలకు అమ్ముడుపోయింది. అంత ధర పలికేంత గొప్పదనం ఆ పండులో ఏముందనే కదా మీ సందేహం. ఈ మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకీ’ రకం. నాందేడ్ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్‌బాయి గైక్వాడ్ ఈ మామిడిని సాగుచేశారు.
ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును రూ. 10 వేల చొప్పున విక్రయించారు. ఈ రకం మామిడిని సాగు చేయడం వెనక ఓ కథ ఉంది. సుమన్‌బాయి కుమారుడు నందకిశోర్ యూపీఎస్సీ పరీక్షల కోసం పూణెలోని కోచింగ్ సెంటర్‌లో చేరారు. అయితే, కరోనా కారణంగా సెంటర్ మూతపడటంతో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు రెడీ అవుతున్న నందకిశోర్ ఆన్‌లైన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి గురించి తెలుసుకున్నాడు. తాము కూడా ఈ సాగు చేపడితే బాగుంటుందని భావించి తల్లికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో దానికి రూ. 6,500 చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి 10 మొక్కలను తెప్పించి సాగు మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం సాగు చేపట్టగా ఈ ఏడాది కాపు వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. తాజాగా వాటిని వ్యవసాయ ప్రదర్శనలో ఉంచగా ఒక్కో పండు రూ. 10 వేల చొప్పున అమ్ముడుపోయాయి. దీని నాణ్యత, అధిక పోషక విలువలు, తక్కువ చక్కెర శాతం కలిగి ఉండటం వలన వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంలోని మరికొందరు రైతులు కూడా ఈ రకాన్ని పండించడానికి ఆసక్తి చూపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

