కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు ?? ఆ మంత్రగాడు మాత్రం ఎలా ఎక్కాడు?
కైలాస పర్వతం.. సాక్షాత్తూ భోళాశంకరుడి నివాసంగా హిందువులు కొలిచే పుణ్యధామం. శివపార్వతులు నందితో కలిసి ఈ పర్వతంపైనే నివసిస్తున్నారన్నది భక్తుల విశ్వాసం. చైనా, టిబెట్ సరిహద్దు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది కైలాస పర్వతం. నిజానికి ఒక ప్రాంతం ఒక మతానికి చెందిన వారికి పవిత్ర స్థలమై ఉంటుంది.
కానీ కైలాస శిఖరం మాత్రం హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఆరాధించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైన హిమాలయాల్లోని ఈ కైలాస శిఖరం గురించి పురాణ, ఇతిహాసాల్లో ఎన్నో కథలున్నాయి. ఈ పర్వతానికి సంబంధించిన రహస్యాలు ఎన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే శివుడి కోసం దైవిక శక్తులన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఆవాసమే కైలాస పర్వతమని చాలా మంది నమ్ముతారు. సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్నాడని భావించే కైలాస పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యం. నిట్టనిలువుగా ఉండి మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని ఎక్కాలంటే ఎన్నో సవాళ్లు, మరెన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సిందే. కైలాస శిఖరాన్ని చేరుకునేందుకు ప్రయత్నించి విఫలమైన వారే తప్ప.. పర్వతంపైకి చేరుకుని అక్కడ ఏమున్నదో తెలుసుకున్న వారెవరూ ఇప్పటి వరకు లేరు. ఎలాంటి సవాళ్లు, ఎంతటి అడ్డంకులనైనా ఎదుర్కొని శిఖరాగ్రానికి చేరుకుంటామని ఛాలెంజ్ చేసి వెళ్లిన వారెవరూ బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు. అందుకే పెద్ద పెద్ద పర్వాతారోహకులు కూడా కైలాస శిఖరాన్ని అధిరోహించేందుకు వెనకడుగువేస్తారు. ఇదే జనాల్లో కైలాస పర్వతమంటే భక్తితో కూడిన భయం ఆవహించేలా చేసింది. ఆధ్యాత్మికంగా కైలాస శిఖరాన్ని అంతెత్తున నిలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
