Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022 ) రాజకీయ పోరు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థి సమాజ్ వాదీ పార్టీ(Samajwadi)లో చేరడంతో యూపీ రాజకీయాల్లో పెను దుమారం రేగింది. అదే సమయంలో, యూపీ ఎన్నికలలో రెండవ దశ ఓటింగ్‌కు ముందు, కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.అమ్రోహా అసెంబ్లీ నియోజకవర్గం () నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సలీం ఖాన్(Saleem Khan) సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే హెలిప్యాడ్‌లో సభ జరుగుతున్న సమయంలో అమ్రోహా సదర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి మెహబూబ్ అలీ హాజరుకావడం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
అమ్రోహ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సలీం ఖాన్ శుక్రవారం రాంపూర్‌లో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిసిన తర్వాత ఎస్పీలో చేరారు. అదే సమయంలో, హెలిప్యాడ్‌లో జరిగిన ఈ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మెహబూబ్ అలీ కూడా ఉన్నారు. గతంలో, సలీం అహ్మద్ ఖాన్ తన వివాదస్పద ప్రకటనలతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తాజాగా ఎన్నికలు రేపనగా, పార్టీ మారడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ సందర్భంగా సలీం ఖాన్ మాట్లాడుతూ బీజేపీని అధికారం నుంచి తప్పించాలంటే ఎస్పీకి ఓటు వేయాలని సూచించారు. సలీం ఖాన్ ఎస్పీలో చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర రసాభస సృష్టించారు. అదే సమయంలో, ఈ నిర్ణయంపై ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఎస్పీలో చేరిన తర్వాత సలీంఖాన్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో ‘కమ్యూనికేషన్ గ్యాప్’ ఉందని సలీం ఖాన్ ఆరోపించారు. అట్టడుగు స్థాయి కార్యకర్తలు జాతీయ నాయకత్వాన్ని కలవకూడదని సెకండ్ లైన్ నాయకత్వం సృష్టించిందని విమర్శించారు. ఈ సమయంలో నేను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలవాలనుకున్నాను, కానీ రెండవ శ్రేణి నాయకత్వం పట్టించకోదని ఆయన ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అని సలీం ఖాన్ తెలిపారు.
యూపీలో ఫిబ్రవరి 14న రెండో దశ పోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10న ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14న రాష్ట్ర అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ జరగనుంది. అయితే, రెండో దశలో, సహారన్పూర్, బిజ్నోర్, అమ్రోహా, సంభాల్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, బదౌన్ మరియు షాజహాన్‌పూర్ సహా 9 జిల్లాలతో సహా మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.