రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రై రెసిపీ..! కేవలం 10 నిమిషాల్లోనే రెడీ..!
ఎగ్ ఫ్రై అంటే తక్కువ టైమ్‌లో రుచికరంగా తయారయ్యే వంటకం. ఇది ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా.. మంచి ప్రోటీన్ అందిస్తుంది. కేవలం కొన్ని సాధారణ పదార్థాలతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైను బ్రేక్‌ఫాస్ట్‌గా, లంచ్ లేదా డిన్నర్‌లో కూడా తినొచ్చు.

ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రై రెసిపీ గురించి తెలుసుకుందాం. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. ముఖ్యంగా వేగంగా చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. మంచి రుచితో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఆయిల్ – 3 టీస్పూన్లు
- ఉల్లిపాయ – 1 (తరిగినది)
- క్యాబేజీ – సన్నగా తరిగినది
- గుడ్లు – 2
- టమోటా – ½ కప్పు (తరిగినది)
- క్యారెట్ – 1 (తరిగినది)
- పచ్చి బఠానీలు – పావు కప్పు (ఉడికించినవి)
- కారం పొడి – ½ టీస్పూన్
- గరం మసాలా – ½ టీస్పూన్
- కొత్తిమీర- ½ టీస్పూన్
- మిరియాల పొడి – తగినంత
తయారీ విధానం
ముందుగా ఒక పాన్ తీసుకుని రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ బాగా నారింజ రంగు వచ్చే వరకు వేయించాలి. ఎందుకంటే ఇది వంటకి రుచిని పెంచుతుంది. ఉల్లిపాయను వేయించిన తరువాత సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్, పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయలను వేసి బాగా కలపాలి. ఈ కూరగాయలు బాగా ఉడికే వరకు వేయించాలి. తరువాత సగం టమోటాను కూడా తరిగి పాన్‌లో వేసి కలపాలి. ఈ మిశ్రమానికి అదనపు రుచి రావడం కోసం ఒక టీస్పూన్ నూనెను వేసి మరోసారి బాగా వేయించాలి.
ఇప్పుడు రెండు గుడ్లను పగులగొట్టి ఈ మిశ్రమంలో జోడించాలి. గుడ్లను మధ్యస్థ మంటలో ఉంచి బాగా కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడికిన తరువాత వాటిని తిప్పుతూ మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఇది గుడ్లకు మంచి రుచిని ఇస్తుంది. తర్వాత కొంచెం కారం పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మసాలాలు వంటకు అదనపు రుచిని ఇస్తాయి. ఇంతే సింపుల్.. ఇలా సులభంగా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి.