AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే మరీ ఇంత డేంజరా?.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!!

పల్లీల్లో బీ కాంప్సెక్స్ విటమమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు రక్తస్రవరణ బాగా జరిగేలా చేస్తుంది. ఎముకలకు కూడా మరింత మంచిది. ఎముకల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్‌ను అందిస్తుంది. కానీ, వేరుశనగలు తినేముందు ఒక్క విషయం మాత్రం తప్పక తెలుసుకోవాలి. లేదంటే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు.

బాబోయ్‌.. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే మరీ ఇంత డేంజరా?.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!!
కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పల్లీలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జలుబ్బు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే, పల్లీలు ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు.. కానీ వీటిని అతిగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2025 | 8:34 PM

Share

వేరుశనగలు.. దాదాపు అందరూ ఇష్టంగా తినే హెల్తీ స్నాక్‌.. ఈ పల్లీలు తినటం వల్ల కేవలం టైమ్‌ పాస్‌ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి బోలెడన్నీ బెనిఫిట్స్‌ ఉన్నాయని మనందరికీ తెలిసిందే. వేరుశనగల్లో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల కేన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్-ఇ అధిక శాతంలో ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించడమే కాకుండా ఆక్సిజన్ ప్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. పల్లీల్లో బీ కాంప్సెక్స్ విటమమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు రక్తస్రవరణ బాగా జరిగేలా చేస్తుంది. ఎముకలకు కూడా మరింత మంచిది. ఎముకల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్‌ను అందిస్తుంది. కానీ, వేరుశనగలు తినేముందు ఒక్క విషయం మాత్రం తప్పక తెలుసుకోవాలి. లేదంటే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు.

పల్లీలు అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదంటారు ఇది మీకు తెలుసా..? దీనికి కారణాలు లేకపోలేదు… వేరుశెనగలు పోషకాహారం, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న మాట వాస్తవం. అయితే వేరుశెనగలు చాలా పొడి స్వభావం కలిగి ఉండటం వల్ల అధిక దాహాన్ని ప్రేరేపించే ధోరణిని కలిగి ఉంటాయి. కాబట్టి పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని చెబుతుంటారు. పైగా ఇందులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పల్లీలు తిన్న తర్వాత నీళ్లు తాగటం వల్ల ఆహార పైపులో కొవ్వు పేరుకుపోవచ్చు. ఫలితంగా చికాకు, దగ్గు వస్తుందని చెబుతున్నారు.

అంతేకాదు.. పల్లీలు తినగానే నీళ్లు తాగితే త్వరగా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావొచ్చు. అలాగే, పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు తిన్న వెంటనే నీటిని తాగితే అవి చల్లగా మారతాయి. దీని వల్ల లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే టెంపరేచర్ మారి జలుబు, దగ్గు వస్తుంది. వేరుశనగ నూనెలా ఉండటం వల్ల తిన్న వెంటనే నీళ్లు తాగితే గొంతులో పుండ్లు, దగ్గు వస్తుంది. అలాగే, వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా బరువు పెరుగుతారట.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..