179 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఆ వెంటనే
గతంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం గోవా నుంచి ముంబైకి వెళ్తుండగా దబోలిమ్ విమానాశ్రయంలో టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్లిన సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేశారు. ఈ ఘటనలో విమానాన్ని పక్షి ఢీకొనడంతో విమానం ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు.

తిరువనంతపురం విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కేరళ నుంచి 179 మంది ప్రయాణికులతో ఓ ఫ్లైట్ బెంగళూరు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ఫ్లైట్‌ను రద్దు చేశారు. చివరికి ప్రయాణికులను మరో ఫ్లైట్‌లో బెంగళూరుకు పంపించారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంటుండగా ఇండిగో విమానం 6E 6629ను పక్షి ఢీకొట్టింది. ఆ తర్వాత విమానాన్ని గంటన్నరకు పైగా తనిఖీ చేశారు. చివరకు విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
గతంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం గోవా నుంచి ముంబైకి వెళ్తుండగా దబోలిమ్ విమానాశ్రయంలో టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్లిన సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేశారు. ఈ ఘటనలో విమానాన్ని పక్షి ఢీకొనడంతో విమానం ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..