బాబోయ్.. బర్డ్‌ఫ్లూ పోయింది అనుకుంటే.. ఎఫ్‌పీవీ ఎంటరైంది..! ఏంటి ఈ కొత్త వైరస్
వీటిలో 100 కి పైగా పిల్లులు చికిత్స ఫలించకపోవడంతో ఇప్పటికే చనిపోయాయి. ఈ వైరస్ వీధి పిల్లులు, పెంపుడు పిల్లులలో కూడా గుర్తించారు. ఇకపోతే, ఈ FPV ఇన్ఫెక్షన్ లక్షణాలు మూడు దశల్లో ఉంటాయని చెబుతున్నారు. మొదటి దశలో వాంతులు, విరేచనాలు, నిర్జలీకరణం సంభవిస్తాయి. రెండవ దశలో అధిక ఉష్ణోగ్రతతో జ్వరం వస్తుంది.. మూడవ దశలో అలసట, నీరసంగా ఉంటుంది.

బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో ప్రాణాంతక ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. పిల్లులను ప్రభావితం చేసే ప్రాణాంతక FPV వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. అందువల్ల ఇంట్లో పిల్లులను పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లులు చనిపోతున్నాయి. ఈ వైరస్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా వ్యాపిస్తోంది. గత నెలలో రాయచూర్‌లో వందకు పైగా పిల్లులలో ఈ వైరస్‌ను గుర్తించారు అధికారులు.
గత ఒక నెలలో రాయచూర్‌లో వందకు పైగా పిల్లులలో ఈ వైరస్ గుర్తించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ సోకిన పిల్లులు బతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ సోకిన 100 పిల్లులలో 99 చనిపోయే అవకాశం ఉందన్నారు. FPV వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. ఒక సమూహంలో 10 పిల్లులు ఉండి, వాటిలో ఒకదానికి వైరస్ సోకితే ఆ వైరస్ కొన్ని సెకన్లలో సమీపంలోని అన్ని పిల్లులకు వ్యాపిస్తుందని చెప్పారు.. ఇది పిల్లులు, కుక్కల యజమానులను ఆందోళనకు గురిచేసింది. గ్రామాల్లో చాలా మంది పిల్లులను పెంచుకుంటారు. అందుకే ప్రస్తుతం ఇంట్లో పిల్లులను పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాంటున్నారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని హెచ్చరిస్తున్నారు.
ఇక, ఈ FPV కి నిర్దిష్ట చికిత్స లేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనావైరస్ లాగే, FPV వైరస్ సంక్రమణకు నిర్దిష్ట చికిత్స లేదని చెప్పారు. లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తారు. రాయచూర్‌లో ప్రస్తుతం 150 కి పైగా కేసులు గుర్తించబడ్డాయి. వీటిలో 100 కి పైగా పిల్లులు చికిత్స ఫలించకపోవడంతో ఇప్పటికే చనిపోయాయి. ఈ వైరస్ వీధి పిల్లులు, పెంపుడు పిల్లులలో కూడా గుర్తించారు. ఇకపోతే, ఈ FPV ఇన్ఫెక్షన్ లక్షణాలు మూడు దశల్లో ఉంటాయని చెబుతున్నారు. మొదటి దశలో వాంతులు, విరేచనాలు, నిర్జలీకరణం సంభవిస్తాయి. రెండవ దశలో అధిక ఉష్ణోగ్రతతో జ్వరం వస్తుంది.. మూడవ దశలో అలసట, నీరసంగా ఉంటుంది.
అయితే, FPV వైరస్ తో మానవులకు కూడా సమస్యలు ఉన్నాయా..? అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇందుకు సమాధానంగా ఎడిన్‌బర్గ్ పశు వైద్య నిపుణులు వివరణ ఇచ్చారు. FPV వైరస్ మానవులకు, కుక్కలకు ఎక్కువగా ప్రమాదాన్ని కలిగించదని చెప్పారు. కానీ, ఇంట్లో పిల్లల్ని పెంచుకునే వారు ధరించే దుస్తులు, బూట్లు, చేతుల ద్వారా వైరస్ పిల్లులకు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..