వామ్మో.. జీలకర్ర అతిగా తింటే ఇన్ని నష్టాలా..? ఎక్కువైతే ఆ సమస్యలు తప్పవు
దీంతో జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి. జీలకర్ర వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి వాంతులు లేదా వికారం కలగవచ్చు. జీలకర్రను అధికంగా తీసుకోవడం వల్ల కూడా పుల్లని బర్ప్స్ వస్తాయి. ఇది గ్యాస్ లక్షణం.

జీలకర్ర.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే అతి ముఖ్యమైన మసాల దినుసు.. వంటల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. జీలకర్ర తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చాలా బలంగా మారుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్రతో అనేక ఉదర సంబంధిత సమస్యలు నయమవుతాయి. దీంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కోరింత దగ్గు, బ్రోన్కైటిస్, అలెర్జీ వంటి శ్వాసకోశ వ్యాధులకు వ్యతిరేకంగా ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. అయితే, అతిగా తింటే అమృతం కూడా విషంగా మారుతుందని చెప్పినట్టుగా.. జీలకర్రను కూడా ఎక్కువగా తీసుకోవటం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
జీలకర్ర ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ సమస్యలు తలెత్తుతాయి. దీంతో జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి. జీలకర్ర వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి వాంతులు లేదా వికారం కలగవచ్చు. జీలకర్రను అధికంగా తీసుకోవడం వల్ల కూడా పుల్లని బర్ప్స్ వస్తాయి. ఇది గ్యాస్ లక్షణం.
కొంతమందికి జీలకర్ర అలెర్జీ ఉండవచ్చు. దీని వలన వారికి చర్మంపై దురద లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, జీలకర్ర అలెర్జీ శ్వాస సమస్యలను కూడా కలిగిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ రోగులు దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. జీలకర్రలో ఉండే నూనె చాలా అస్థిరంగా ఉంటుంది. దాని అధిక వినియోగం కాలేయం లేదా మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..