ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే, ఈ ప్రోటీన్ తప్పనిసరి..!
కాబట్టి దాని లోపం ఎముకలు బలహీనపడటానికి దారితీస్తుంది. ఆల్కహాల్, సిగరెట్లు తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో కొల్లాజెన్ సరైన మొత్తంలో ఉన్నప్పుడు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు మీ వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వైద్యుల సలహా మేరకు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

కొల్లాజెన్ మృదులాస్థిలో ఒక ముఖ్యమైన భాగం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా ముఖ్యం. శరీరం స్వయంగా కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దాని ఉత్పత్తి వయస్సు పెరిగే కొద్దీ తగ్గడం ప్రారంభమవుతుంది. కొల్లాజెన్ లోపం వల్ల కీళ్ల నొప్పులు, చర్మం ముడతలు పడడం జరుగుతుంది. కొల్లాజెన్ గోర్లు, జుట్టు ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. కాబట్టి దాని లోపం వల్ల గోర్లు, జుట్టు పొడిగా, సన్నగా, పెళుసుగా మారవచ్చు.
కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది కండరాలు, కీళ్ళు, చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. మన శరీరం దానిని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో కొల్లాజెన్ లోపిస్తే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కొల్లాజెన్ కండరాల కణజాలానికి కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి దాని లోపం కండరాల నొప్పి, బలహీనతకు కారణమవుతుంది. జీర్ణవ్యవస్థకు కూడా కొల్లాజెన్ కూడా ముఖ్యమైనది. కాబట్టి దాని లోపం ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.
కొల్లాజెన్ శక్తి ఉత్పత్తిలో కూడా కీలకం. దీని లోపం కారణంగా అలసట, శక్తి లేకపోవడానికి దారితీస్తుంది. కొల్లాజెన్ ఎముక కణజాలంలో ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి దాని లోపం ఎముకలు బలహీనపడటానికి దారితీస్తుంది. ఆల్కహాల్, సిగరెట్లు తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో కొల్లాజెన్ సరైన మొత్తంలో ఉన్నప్పుడు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు మీ వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వైద్యుల సలహా మేరకు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..