AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ..! అందం, ఆరోగ్యంతో పాటు..

చాలా మంది ఉదయాన్నే కప్పు కాఫీ లేదంటే టీ గానీ కడుపులో పడకపోతే,.. ఏ పనీ ముందుకు సాగాదు.. మన దేశంలో చాలా మంది చాయ్‌ ప్రియులు ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో పాలతో తయారు చేసిన టీ తాగటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా ఉంది.. దాంతో ప్రజలు కొన్ని రకాల హెర్బల్‌ టీలను అలవాటు చేసుకుంటున్నారు. అందులో ఒకటి మందార పూల టీ.. దీనిని మందార పువ్వుల నుంచి తయారు చేస్తారు. మందార పూల టీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మందార పూలతో చేసిన టీ కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ..! అందం, ఆరోగ్యంతో పాటు..
Hibiscus Tea
Jyothi Gadda
|

Updated on: Mar 24, 2025 | 8:10 PM

Share

దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే అందమైన మందార పువ్వు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మందారంలో పాలీఫెనాల్స్, ఆల్ఫా-గ్లూకోసిడేస్, ఆల్ఫా-అమైలేస్ వంటి ఎంజైములు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మందార టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. మందార టీ గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాటిక్ లైపేస్ వంటి ఎంజైమ్‌లను తొలగించడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.. ఇది శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి వేడి కారణంగా చర్మంపై మొటిమలు, కురుపులు మొదలైన వాటితో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇందులో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కాలానుగుణ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుంది.

మందారంలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మందార టీ తాగడం వల్ల ఒత్తిడి స్థాయిలు, అలసట, ఉద్రిక్తత తగ్గుతాయి. వ్యాధి కారక బ్యాక్టీరియాతో మందార టీ పోరాడుతుంది. కాలేయ ఆరోగ్యానికి మందార టీ ఎంతో మేలు చేస్తుంది. మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే మందార టీ తాగాలి. ఇది మీ జుట్టును అందంగా, బలంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​
ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​
వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?
వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?
బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే
బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే
బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే
బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే