Sobhita – Naga Chaitanya: అభిమాని అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో.. శోభిత, నాగచైతన్య ప్రేమకు పునాది.. లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే..
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ జంటలలో నాగచైతన్య, శోభిత ధూళిపాల ఒకరు. గతేడాది డిసెంబర్ నెలలో పెద్దల సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత మొదటిసారి ప్రముఖ వోగ్ మ్యాగజైన్ ఏప్రిల్ సంచిక కవర్ పేజీపై కనిపించారు. ఈ సందర్భంగా ఆ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇటీవలే తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు అక్కినేని నాగచైతన్య. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈమూవీలో మరోసారి చైతూ సరసన సాయి పల్లవి నటించింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చైతూ కెరీర్ లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతూ.. మొదటి సారి తన భార్య శోభితతో కలిసి ప్రముఖ వోగ్ మ్యాగజైన్ ఏప్రిల్ సంచిక కవర్ పేజీపై కనిపించారు. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసిన ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలయ్యింది. ఈ సందర్బంగా వోగ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభితా, చైతన్య తమ లవ్ స్టోరీ, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శోభిత మాట్లాడుతూ.. ఒకసారి తాను ఇన్ స్టాలో అభిమానులతో కలిసి ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ చేశానని.. ఆ సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్న తన దృష్టిని ఆకర్షించి.. చైతన్యను ఇన్ స్టాలో ఫాలో అయ్యేలా చేసిందని చెప్పుకొచ్చింది. “నేను ఇన్ స్టాలో ఫ్యాన్స్ ప్రశ్నలు చూస్తున్నాను. అప్పుడు ఒక అభిమాని మీరు నాగచైతన్యను ఎందుకు ఫాలో కావడం లేదు ? అని అడిగారు. ఏమిటి ? అని ఆశ్చర్యపోయాను. వెంటనే చైతన్య ప్రోఫైల్ కు వెళ్లి చూశాను. అతడు దాదాపు 70 మందిని ఫాలో అవుతున్నాడు. అందులో నన్ను కూడా ఫాలో అవుతున్నారు. దీంతో నేను చైతన్యను తిరిగి ఫాలో అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఇరువురి పోస్టులకు లైక్స్ కొట్టడం.. DMల ద్వారా చాట్ చేయడం ప్రారంభించామని.. ఇద్దరి మధ్య స్నేహం మొదలైందని చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 22లో చైతన్య వారి మొదటి డేట్ కోసం ముంబైకి విమానం బుక్ చేసినట్లు తెలిపింది. ఇదంతా సహజంగానే జరిగిందని అన్నారు శోభిత. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు గతేడాది హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..