26 March 2025
మూడు బ్లాక్ బస్టర్స్.. 28 ఏళ్లకే రూ.66 కోట్లు సంపాదించిన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. తెలుగుతోపాటు హిందీలోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
గత రెండేళ్లల్లో ఆమె నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.
కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక.. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటుంది.
తాజాగా ఆమె ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక బయటపెట్టింది. కర్ణాటకకు చెందిన రష్మిక వయసు ప్రస్తుతం 28 సంవత్సరాలు మాత్రమే.
కానీ ఆమె ఆస్తులు మాత్రం రూ.66 కోట్ల వరకు ఉంటుందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
ఇక ఇటీవల విక్కీ కౌశల్ జోడిగా ఛావా సినిమాతో మరో సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో త్వరలోనే ఆమె ఆస్తి రూ.100 కోట్లకు చేరొచ్చని అంచనా.
సినిమాలే కాకుండా అటు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, గోవా, కూర్గ్ ప్రాంతాల్లో ఆమెకు ఆస్తులు ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్