Watch: ఫ్లై ఓవర్‌పై సడన్‌గా కాన్వాయ్ ఆపిన ఢిల్లీ సీఎం..!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వ పాలనలో తనదైన ప్రత్యేకతను చూపుతున్నారు. హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై తిరుగుతున్న పశువులను గమనించి వెంటనే చర్య తీసుకున్నారు. ఆమె కాన్వాయ్‌ను ఆపి, సంబంధిత అధికారులకు ఆశ్రయం లేని పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. రోడ్లపై పశువుల సంచారం సమస్యకు ఇది ఒక మంచి పరిష్కారమని, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడించడంలో తనదైన ప్రత్యేకతను చూపుతున్నారు. ఢిల్లీలోని హైదర్‌పూర్ ఫ్లై ఓవర్‌పై పశువులు సంచరించడాన్ని గమనించిన ఆమె కాన్వాయ్‌ను ఆపారు. ఆశ్రయం లేకుండా నడిరోడ్డుపై తిరుగుతున్న పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశువులు తరచూ నడిరోడ్లపై తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం పట్ల అక్కడి వాహనదారులు హర్షం వ్యక్తచేశారు.