Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంగానీ దేశంలో “భూ మంతర్‌”కు తెరలేపిన నిత్యానంద.. 20 మందిపై బహిష్కరణ వేటు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న దొంగ సామి నిత్యానందకు మరో షాక్ తగలింది. బొలీవియాలోని ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ నిత్యానంద స్థాపించిన కల్పిత దేశం కైలాస నుండి 20 మంది పౌరులను బహిష్కరించినట్లు ప్రకటించింది. బొలీవియాలోని స్థానిక సమాజానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి సభ్యులు ప్రయత్నించారని ఆ దేశం తెలిపింది.

దేశంగానీ దేశంలో భూ మంతర్‌కు తెరలేపిన నిత్యానంద.. 20 మందిపై బహిష్కరణ వేటు
Bolivia Nityananda
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2025 | 9:01 PM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న దొంగ సామి నిత్యానందకు మరో షాక్ తగలింది. బొలీవియాలోని ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ నిత్యానంద స్థాపించిన కల్పిత దేశం కైలాస నుండి 20 మంది పౌరులను బహిష్కరించినట్లు ప్రకటించింది. బొలీవియాలోని స్థానిక సమాజానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి సభ్యులు ప్రయత్నించారని ఆ దేశం తెలిపింది. “ఈ వర్గం పర్యాటకులుగా బొలీవియాలోకి ప్రవేశించింది. వివిధ మార్గాల ద్వారాల ద్వారా వేర్వేరు సమయాల్లో వచ్చింది. కొంతమంది వ్యక్తులు నవంబర్ 2024 నుండి బొలీవియాలో ఉన్నారు. ఎక్కువ మంది జనవరి 2025లో ప్రవేశించారు” అని బొలీవియా ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ కేథరీన్ కాల్డెరాన్ అన్నారు.

మన దేశంలో చేయకూడని పనులన్నీ చేసి ఫారిన్‌ చెక్కేసిన నిత్యానంద..ఏకంగా సొంత దేశాన్నే ఏర్పాటు చేసినట్టు ప్రకటించుకున్నారు. తమ దేశానికి సొంత కరెన్సీ, సొంత పౌరసత్వం, సొంత ప్రభుత్వం ఎన్నో ఉన్నాయంటూ వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తుంటారు. కానీ ఆ దేశం వరల్డ్‌ మ్యాప్‌లో కాదు కదా.. గూగుల్‌ మ్యాప్‌లో కూడా కనిపించదు. తానే శివుడని చెప్పుకునే నిత్యానందుడి కైలాస దేశం ఎక్కడ ఉందో తెలియదు గానీ.. ఆ దేశానికి ఎక్స్‌టెన్షన్‌ కూడా మొదలుపెట్టారు. అందుకోసం దక్షిణ అమెరికాలోని బొలీవియాను టార్గెట్‌ చేశాడు. నిత్యానంద. తన శిష్యులతో కలిసి అక్కడి గిరిజనుల నుండి అతి చౌకగా లక్షల ఎకరాలు భూములు కొట్టేయడానికి ప్లాన్‌ చేశారు.

బొలీవియాలోని ఓ అటవీప్రాంతంలో మొత్తం 4.8 లక్షల హెక్టార్లు..అంటే 11 లక్షల 86 వేల 105 ఎకరాలు అతి చౌకగా కొట్టేయడానికి స్కెచ్‌ గీశారు. నిత్యానంద. ఇందుకోసం అక్కడి గిరిజనులతో వెయ్యి సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ కేవలం 8 లక్షల 96 వేల మాత్రమే. అంటే రోజుకు 2 వేల 455 రూపాయిలు. ఈ ఒప్పందం ద్వారా ఆ భూములతో పాటు అక్కడి వనరులపై నిత్యానందకే సర్వహక్కులు చెందేలా ఒప్పందంలో షరతులు విధించారు నిత్యానంద.

బొలీవియాలో భూములు కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాన్ని.. కైలాసానికి ఎక్స్‌టెన్షన్‌గా ప్రకటించాలనుకున్నారు నిత్యానంద. అయితే ఈ ల్యాండ్‌ స్కామ్‌ గురించి అంతకుముందే మీడియాలో లీకయింది. దీంతో రంగంలోకి దిగిన బొలీవియా ప్రభుత్వం.. వ్యవహారంపై ఆరా తీసింది. అతగాడి లీలలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఖ్యాతికెక్కడంతో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ భూదందాలో కీలకంగా వ్యవహరించిన వారిని తమ భూభాగం నుంచి బహిష్కరిస్తున్నట్లు బొలీవియా ప్రకటించింది. బొలీవియా ప్రభుత్వ మంత్రి ఎడ్వర్డో డెల్ కాస్టిల్లో డెల్ కార్పియో ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే ప్రస్తుత చట్టం ప్రకారం విదేశీయులు అమెజాన్ ప్రాంతంలో భూమిని పొందలేరని బొలీవియన్ వ్యవసాయ, భూ అభివృద్ధి మంత్రి యామిల్ ఎలోన్స్ అన్నారు. గిరిజన ప్రజల విశ్వాసం ఉల్లంఘించడానికి, వారి హక్కులను కూడా కాలరాసేందుకు ప్రయత్నించిందన్నారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎక్సాల్టాసియన్ మునిసిపాలిటీలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మిగిలిన 17 మందిని శాంటా క్రజ్‌లో గుర్తించారు. ఆ వ్యక్తులు బొలీవియాలోకి ప్రవేశించిన ఉద్దేశ్యాన్ని పాటించలేదు. దేశంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. తత్ఫలితంగా, వారిని తప్పనిసరి పరిస్థితుల్లో బహిష్కరిస్తున్నట్లు బొలీవియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. వారు వెంటనే బొలీవియాను విడిచి వెళ్లాలని ఆదేశించింది.

నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. 2003లో నిత్యానంద స్వామిగా అవతారం ఎత్తి.. కర్ణాటకలోని బిడదిలో ఆశ్రమం స్థాపించారు. అయితే అత్యాచారం, భక్తుల నిర్బంధం వంటి కేసులు నమోదవడంతో నిత్యానంద 2019లో భారతదేశాన్ని వదిలి పారిపోయారు. కైలాస పేరుతో సెట్‌ చేసుకున్న ప్లేస్‌ నుంచి తన అపరేషన్‌ చేస్తున్నారు.

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..