AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. జనవరిలో ఏకంగా 16 రోజులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..?

బ్యాంకు సెలవుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీని వల్ల బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే ముందే చేసుకోవచ్చు. ప్రతీ నెలా బ్యాంకులకు కొన్ని రోజులు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి. జనవరిలో బ్యాంక్ సెలవులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి.

Venkatrao Lella
|

Updated on: Jan 02, 2026 | 5:42 PM

Share
ఆర్ధిక కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకోవడానికి ప్రతీఒక్కరికీ బ్యాంకులనేవి తప్పనిసరిగా అవసరం. అందుకే బ్యాంకులు ఏయే రోజుల్లో వర్క్ చేస్తాయి..? సెలవులు ఎప్పుడు ఉంటాయి? అనేది తెలుసుకోవాలి. వీటి పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ఏదైనా అవసరమైన సందర్భంలో ముందే జాగ్రత్త పడవచ్చు. 2026 జనవరిలో బ్యాంకు సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

1 / 5
2026 జనవరిలో మొత్తం  16 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. జనవరి 1 తేదీన న్యూ ఇయర్ సందర్భంగా బ్యాంకులు మూతపడగా.. జనవరి 2న రాజు జయంతి కారణంగా కేరళ, మిజోరంలో బ్యాంకులు బంద్ అయ్యాయి. ఇక జనవరి 3న హజ్రత్ అలీ పండుగ కారణంగా ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.

2 / 5
ఇక జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు పనిచేయవు. జనవరి 14న  మకర సంక్రాంతి, మఘ్ బిహూ ఉత్సవాల కారణంగా గుజరాత్, ఒడిశా, అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక జనవరి 15న సంక్రాంతి కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.

3 / 5
జనవరి 16న తిరువళ్లువర్ పండుగ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు మూసివేయనున్నారు. జనవరి 17న రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడులో బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపురలోని బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

4 / 5
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి.  ఇక ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులు ఎలాగూ సెలవులు ఉంటాయి. వీటిన్నింటినీ లెక్కేస్తే 16 రోజులు మూతపడనున్నాయి. స్థానిక పండుగలను బట్టి బ్యాంకులకు సెలవులను ఆర్బీఐ ప్రకటిస్తూ ఉంటుంది.

5 / 5