Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుర్రెకో బుద్ధి అని ఊరికే అన్నారా.. పెదాలు, నాలుక కోసుకుని, కొమ్ములు తెచ్చుకున్నాడు..!

బ్రెజిల్‌కు చెందిన 31 ఏళ్ల పెడ్రో, ఎనిమిది సంవత్సరాల క్రితం తన శరీరాన్ని సవరించుకోవడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు తల నుండి కాలి వరకు టాటూలతో నింపేసుకున్నాడు. అంతేకాదు తన రూపాన్ని విచిత్రంగా మార్చుకోవడంలో నిమగ్నమయ్యాడు. తన పెదవులు, నాలుకను రెండు భాగాలుగా కోసుకుని, కోమ్ములు కూడా తెప్పించుకున్నాడు. తనకు అత్యంత బాధాకలిగిస్తన్నప్పటికీ శరీర మార్పు తనకు ఎంతో ఇష్టం అంటున్నాడు.

పుర్రెకో బుద్ధి అని ఊరికే అన్నారా.. పెదాలు, నాలుక కోసుకుని, కొమ్ములు తెచ్చుకున్నాడు..!
Pedro Kenso
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2025 | 6:49 PM

‘‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’’ పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదేమో..! పిచ్చి పరాకాష్ఠకు చేరిన ఓ వ్యక్తి తన రూపాన్నే మార్చుకున్నాడు. నిజంగానే పుర్రెలా మార్చుకోవడానికి 8 ఏళ్ల పాటు శ్రమించాడు. ఇందుకోసం తన పెదవులు, నాలుకను రెండు భాగాలుగా కత్తిరించుకుని, తలపై కొమ్ములు కూడా తెప్పించుకని విపరీత చేష్టలకు పాల్పడ్డాడు. ఇందు కోసం బాగానే ఖర్చు చేశాడు. అంతేకాదు, దీని వల్ల తన ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని అంటున్నాడు. బ్రెజిల్ నివాసి పెడ్రో హెన్రిక్ సిల్వా డోస్ శాంటోస్.

బ్రెజిల్ నివాసి పెడ్రో హెన్రిక్ సిల్వా డోస్ శాంటోస్‌కు టాటూలు వేయించుకోవడం, శరీర మార్పులపై తనకున్న మక్కువ కారణంగా తన మొత్తం రూపాన్ని మార్చుకున్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు అతన్ని ‘బతికి ఉన్న దెయ్యం’ అని పిలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. కానీ పెడ్రో తాను సంతోషంగా ఉన్నానని, వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని చెబుతాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన 31 ఏళ్ల పెడ్రో ఇటీవల సిలికాన్ మార్పిడి ద్వారా తలపై కొమ్ములు పెరిగాయి. అతను తన అభిరుచికి పూర్తిగా అంకితభావంతో ఉన్నానని చెబుతాడు. కానీ అది చాలా బాధాకరమైన ప్రక్రియ అని ఒప్పుకుంటాడు. సోషల్ మీడియాలో పెడ్రోకు సంబంధించిన దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Pedro Kenso (@pedrokenso)

పెడ్రో ఎనిమిది సంవత్సరాల క్రితం తన శరీరాన్ని మార్పులు చేసుకోవడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు తల నుండి కాలి వరకు పచ్చబొట్లు వేయించుకునే స్థాయికి తన రూపాన్ని మార్చుకోవడంలో నిమగ్నమయ్యాడు. తన పెదవులు, నాలుకను రెండు భాగాలుగా కోయడం తనకు అత్యంత బాధాకరమైన శరీర మార్పు అని అతను చెప్పాడు. పెదవి కత్తిరించుకోవడం అత్యంత బాధాకరమైనదని ‘నీడ్ టు నో’తో చెప్పాడు. ఈ ప్రక్రియ అంత బాధాకరమైనది కాదు, కానీ అనస్థీషియా ప్రభావం తగ్గడంతో, నొప్పి భరించలేనిదిగా మారింది. అయితే, శరీర మార్పు తనకు చాలా ఇష్టమైన పని కాబట్టి, ఈ నొప్పిని కూడా తాను భరిస్తానని ఆయన అంటున్నారు.

పెడ్రో తన భార్య వెనెస్సా మెండిస్ డోస్ శాంటోస్, అతని పిల్లలు మైఖేలీ, పియట్రో తనకు చాలా మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అందుకే వారు ఇలా రూపురేఖల మార్పు గురించి ఆందోళన చెందరు. అలాగే జనం ఏమి చెబుతారో కూడా పట్టించుకోనన్నారు. తాను సంతోషంగా ఉన్నానని, శరీర మార్పు ప్రక్రియను కొనసాగిస్తానని అంటున్నాడు పెడ్రో. సోషల్ మీడియాలో తనకు తరచుగా ద్వేషపూరిత వ్యాఖ్యలు వస్తాయని పెడ్రో అంటున్నారు. కొంతమంది అతని ముఖం చూసి, అతన్ని ‘బతికి ఉన్న దెయ్యం’ అని కూడా పిలుస్తున్నారు. అయితే, ఈ విషయాలు పెడ్రోకు పట్టింపు లేదు. ఇప్పటివరకు అతను శరీర మార్పుల కోసం దాదాపు 2,000 పౌండ్లు (అంటే దాదాపు రూ. 2.21 లక్షలు) ఖర్చు చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..