AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌, డైటింగ్ అవసరమే లేదు.. రోజూ ఇలా నడిస్తే కొవ్వు మంచులా కరుగుతుంది..

నేటి కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. దీని కోసం చాలా మంది జిమ్‌లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటారు. మరికొందరు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయితే అవేమీ లేకుండా కేవలం నడకతోనే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నడవటం కాకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే సులభంగా స్లిమ్‌గా మారవచ్చు. నడక ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందే 5 సులభమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Dec 29, 2025 | 6:22 PM

Share
నడక ప్రయోజనాలు: నడక కేవలం కేలరీలను బర్న్ చేయడమే కాకుండా శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్ని వయసుల వారు చేయగలిగే అత్యుత్తమ వ్యాయామం ఇది. క్రమం తప్పకుండా నడవడం వల్ల కీళ్ల నొప్పుల ముప్పు కూడా తగ్గుతుంది.

1 / 6
భోజనం తర్వాత: చాలా మంది తిన్న వెంటనే పడుకుంటారు. కానీ భోజనం చేసిన తర్వాత 10 నుండి 20 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

2 / 6
పవర్ వాకింగ్: సాధారణంగా నడవడానికి, పవర్ వాకింగ్‌కు చాలా తేడా ఉంది. కొంచెం వేగంగా, చేతులను లయబద్ధంగా ఆడిస్తూ నడవడాన్ని పవర్ వాకింగ్ అంటారు. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరిగి, కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మోకాళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.

3 / 6
మెట్లు ఎక్కడం: చదునైన నేలపై నడవటం కంటే మెట్లు ఎక్కడం లేదా ఎత్తు పల్లాల ఉన్న చోట నడవడం వల్ల ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. ఇది మీ తొడలు మరియు పొట్ట కండరాలపై ఒత్తిడిని పెంచి, మొండి కొవ్వును సైతం కరిగించేలా చేస్తుంది.

4 / 6
కొంచెం బరువుతో నడక: నడుస్తున్నప్పుడు వెనుక చిన్న బ్యాక్‌ప్యాక్ ధరించడం లేదా తేలికపాటి బరువులు చేతిలో పట్టుకోవడం వల్ల శరీరం మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.

5 / 6
ఇంటర్వెల్ వాకింగ్: ఒకే వేగంతో కాకుండా వేగాన్ని మారుస్తూ నడవండి. ఉదాహరణకు ఒక నిమిషం పాటు చాలా వేగంగా నడిచి, తర్వాతి నిమిషం నెమ్మదిగా నడవండి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ రెట్టింపు అవుతుంది.

6 / 6