AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్లీపర్ రైళ్ల ప్రారంభంపై రైల్వేశాఖ క్లారిటీ.. ఎప్పుడంటే..?

Indian Railway: కొత్త ఏడాది వస్తున్న వేళ రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన రైళ్లు, ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. అలాగే వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లపై ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది రైల్వేశాఖ.

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..  స్లీపర్ రైళ్ల ప్రారంభంపై రైల్వేశాఖ క్లారిటీ.. ఎప్పుడంటే..?
Venkatrao Lella
|

Updated on: Dec 29, 2025 | 9:58 PM

Share

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. కొత్త ఏడాదిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 2026 జనవరిలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సిద్దమవుతోంది. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలోనే వందే భాతర్ స్లీపర్ రైలు ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు రానుందని తెలిపింది. ఇప్పటికే ఈ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్స్ పూర్తవ్వగా.. దాని ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆ మార్పులు దాదాపుగా పూర్తవ్వడంతో కొత్త ఏడాది ప్రారంభంలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది.

భారత్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగపర్చేందుకు సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటికే నాన్ ఏసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అమృత్ భారత్ రైళ్లను తీసుకొచ్చామని, త్వరలోనే ఏసీలో ప్రయాణించేవారి కోసం వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ నెల 26 నాటికి దేశవ్యాప్తంగా 164 మందే భారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయని, ఈ ఏడాది 42 కొత్త ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారంది. 13 ప్రాజెక్టులను ప్రారంభించారని, 21 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పింది. రైల్వేల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగే పెట్టుబడలను ఆహ్వానించినట్లు తెలిపింది. 272 కిలోమీటర్లతో కూడిన ధాంపూర్- బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టును 2025లో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారని, 36 సొరంగాలు, 943 వంతెనలతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్ అత్యంత సవాల్‌తో కూడుకున్నదని రైల్వేశాఖ పేర్కొంది.

అటు ఈ ఏడాది రైల్వే టికెటింగ్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకోకుండా పారదర్శకత తీసుకొచ్చే చర్యలు చేపట్టినట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న 5.73 కోట్ల అనుమానాస్పద ఐఆర్‌సీటీసీ అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. తత్కాల్ టికెట్లలో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది మిజోరంలో 51 కిలోమీటరల్ బైరాబి-సైరాంగ్ బ్రాడ్ గేజ్ లైన్ నిర్మించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.