JEE Advanced 2026 Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రిజిస్ట్రేషన్‌లు ఎప్పట్నుంచంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు దేశ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యేటా లక్షలాది మంది ఈ పరీక్షకు పోటీ పడుతుంటారు. ఇందులో భాగంగా 2026 యేడాదికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండు విడతల షెడ్యూలన్‌లను ప్రకటించిన ఎన్టీయే తాజాగా..

హైదరాబాద్, డిసెంబర్ 30: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (జేఈఈ అడ్వాన్స్‌డ్) పరీక్ష 2026 పూర్తి షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ 2026లో అర్హత సాధించిన తొలి 2.50 ర్యాంకులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. షెడ్యూల్ ప్రకారం వీరందరూ ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు రిజిస్ట్రేషన్‌కు చేసుకోవచ్చు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పేపర్ 1 ఆన్‌లైన్ పరీక్ష మే 17న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలు జూన్ 1వ తేదీన విడుదల చేయనుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్‌తోపాటు ఐఐటీ రూర్కీ పరీక్ష సిలబస్‌ను కూడా విడుదల చేసింది. ఈ మేరకు సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో కీలక కాన్సెప్టులను కవర్ చేసేలా సిలబస్ రూపొందించారు. అలాగే అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి గత 19 ఏళ్లకు సంబంధించిన అంటే 2007 నుంచి 2025 వరకు గల పాత ప్రశ్నపత్రాలను కూడా ఐఐటీ రూర్కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు అభ్యర్థుల సౌలభ్యంగా ప్రాక్టీసు చేసేందుకు వీలుగా పాత క్వశ్చన్ పేపర్లను అందుబాటులో ఉంచింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




