NCHM JEE 2026 Exam: హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశాలకు NCHM JEE 2026 నోటిఫికేషన్ విడుదల
NCHM JEE 2026 Notification: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE)2026 నోటిఫికేషన్..

దేశవ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (NCHM&CT)కి అనుబంధమైన ఇన్‌స్టిట్యూట్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE)2026 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇందులో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 25, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)లో ప్రవేశాలు పొందాలంటే ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.450 చొప్పున ఫీజు చెల్లించాలి. ఇక ఆన్‌లైన్ రాత పరీక్ష ఏప్రిల్ 25, 2026వ తేదీన నిర్వహిస్తారు.
పరీక్ష విధానం ఇలా..
ఈ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 480 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కు చొప్పున కోత విధిస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్‌లో 15 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్‌లో 15 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఎఫైర్స్‌లో 15 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 45 ప్రశ్నలు చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్‌లో 30 మార్కులకు ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




