AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాధ్యతాయుతమైన సాంకేతికతపై రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం.. కేంద్ర మంత్రి ట్వీట్‌ వైరల్

ప్రజా ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్త ఏఐ నైపుణ్యం, సాంకేతికతను వినియోగించుకోవడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ మేరకు శుక్రవారం (ఫిబ్రవరి 6) భువనేశ్వర్‌లో జరిగిన బ్లాక్ స్వాన్ సమ్మిట్‌ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం వీడియోని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ట్వీట్‌ చేసి మరోమారు నొక్కి చెప్పారు..

బాధ్యతాయుతమైన సాంకేతికతపై రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం.. కేంద్ర మంత్రి ట్వీట్‌ వైరల్
President Droupadi Murmu At Black Swan Summit
Srilakshmi C
|

Updated on: Feb 06, 2026 | 8:55 PM

Share

భువనేశ్వర్, ఫిబ్రవరి 6: దేశంలో డిజిటల్, ఫిన్‌టెక్ పర్యావరణ వ్యవస్థ విస్తరించే కొద్దీ బాధ్యతాయుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు. తుదకు సాంకేతిక అనేది సామాజిక న్యాయం, మానవ గౌరవానికి సేవ చేసేదిగా మాత్రమే ఉండాలని అన్నారు. భారత్‌ ఫిన్‌టెక్ ప్రయాణాన్ని కేవలం సాంకేతిక ఆవిష్కరణల కథగా మాత్రమేకాకుండా, ఇన్‌క్లూషన్‌, జండర్‌ ఈక్వాలిటీ కథగా గుర్తుంచుకోవాలని అన్నారు. ఫిన్‌టెక్ అనేది సాంకేతిక పదం కాదు. ఇది ప్రజలకు జీవనాధారంగా మారింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలుగా మారాయి. ముఖ్యంగా రైతులకు సకాలంలో చెల్లింపులు, చిన్న కిరాణా దుకాణాలకు డిజిటల్ లావాదేవీలను జరపడంలో ఎలా ఉపయోగపడ్డాయో ఈ ప్రసంగంలో వివరించారు.

గత దశాబ్దంలో భారత్‌ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఆధారిత పరివర్తన చెందిందని అన్నారు. 570 మిలియన్లకు పైగా జన్-ధన్ ఖాతాలు తెరవబడ్డాయని, అందులో 56% కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్, బేసిక్‌ బ్యాంకు అకౌంట్‌తో నేడు మహిళలు తమ ఖాతాల్లోనే నేరుగా సంక్షేమ ప్రయోజనాలను పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే ఎంపవర్‌మెంట్‌ యాక్షన్‌ అని అన్నారు. గ్రామ స్థాయి వ్యవస్థాపకులు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నుంచి ఇంజనీర్లు, వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల వరకు అంతటా మహిళలు కనిపించాలని, అదే సమగ్ర ఫిన్‌టెక్ ఫ్రేమ్‌వర్క్ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ వేగవంతమైన డిజిటలైజేషన్.. సైబర్ భద్రతా బెదిరింపులు, ఆన్‌లైన్ మోసం, డీప్‌ఫేక్స్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదాలను కూడా తెస్తుందని రాష్ట్రపతి హెచ్చరించారు. సాంకేతికత మాత్రమే ఇన్‌క్లూషన్‌కు దోహదపడదని.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విస్తృత భాగస్వామ్యం పొందాలంటే డిజిటల్ అక్షరాస్యత ఎంతో అవసరమని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇది చాలా అవసరమని నొక్కి చెప్పారు. బాధ్యతాయుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలని చెబుతూ.. పౌర కేంద్రీకృత, నైతిక పరిష్కారాలను రూపొందించాలని వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలను రాష్ట్రపతి కోరారు. డిజిటల్ ఫైనాన్స్, పాలనలో పారదర్శకతను పెంచాలని, ప్రజలకు వారి ఆర్థిక లావాదేవీలపై మరింత నియంత్రణను ఇవ్వాలని ఆమె అన్నారు. కృత్రిమ మేధస్సు (AI) గురించి ముర్ము మాట్లాడుతూ.. AI ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను వేగంగా పునర్నిర్మిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల నైతిక, సమగ్ర వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇండియా AI మిషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డిజిటల్ పరివర్తన ఎజెండాలో భాగంగా పాలన, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ప్రజా సేవా డెలివరీలో పెరుగుతున్న ఏఐ పాత్రను ఆమె వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.