AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Soap vs Face Wash: అందంగా, మెరిసిపోయే ముఖం ఉండాలని ఎవరికి ఉండదు..? కానీ ఆ మెరుపు కోసం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మన చర్మాన్ని దెబ్బతీస్తున్నాయని మీకు తెలుసా? చాలా మందికి ఉండే అతిపెద్ద సందేహం.. ముఖానికి సబ్బు వాడాలా లేక ఫేస్ వాష్ వాడాలా? నిపుణులు ఏమంటున్నారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..
Soap Vs Face Wash
Krishna S
|

Updated on: Feb 07, 2026 | 11:57 AM

Share

నేటి ఆధునిక జీవనశైలిలో యువతను అత్యంత ఎక్కువగా వేధిస్తున్న సమస్య ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మం పొడిబారడం. పెరిగిన కాలుష్యం, జంక్ ఫుడ్ సంస్కృతి, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల ముఖం తన సహజ మెరుపును కోల్పోయి నిర్జీవంగా మారుతోంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొంది, ముఖాన్ని అందంగా ఎలా మార్చుకోవాలనేదానిపై నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.

సబ్బు వద్దు.. ఫేస్ వాష్ ముద్దు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సాధారణ సబ్బుల్లో ఉండే కెమికల్స్ చర్మంపై ఉన్న సహజ సిద్ధమైన నూనెలను తొలగించి, చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. అందుకే ఏదైనా మంచి బ్రాండ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించడం ఉత్తమం. రోజుకు కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా బయటి నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోవడం వల్ల దుమ్ము, కాలుష్య కణాలు తొలగిపోతాయి. చలికాలంలో గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.

ముఖాన్ని తుడిచేటప్పుడు జాగ్రత్త..

చాలా మంది ముఖం కడుక్కున్న తర్వాత టవల్‌తో గట్టిగా రుద్దుతుంటారు. ఇది చర్మానికి హాని చేస్తుంది. శుభ్రమైన కాటన్ వస్త్రంతో ముఖంపై ఉన్న నీటిని సున్నితంగా అద్దుతూ తుడవాలి. అలాగే ముఖంపై ఉన్న మొటిమలను గోళ్లతో గిల్లడం లేదా పగలగొట్టడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ మచ్చలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు

పూర్వీకుల కాలం నుండి వస్తున్న కొన్ని చిట్కాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి..

  • ముఖానికి పాల మీగడ రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
  • ముల్తానీ మిట్టి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, చర్మంపై ఉన్న అదనపు నూనెను ఇది తొలగిస్తుంది.
  • శనగపిండితో ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా మృదువుగా తయారవుతుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లు

కేవలం పైన పూసే క్రీముల వల్ల మాత్రమే కాకుండా లోపలి నుండి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి..

      • రోజుకు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి.
      • నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తగ్గించాలి.
      • కనీసం 7-8 గంటల నిద్ర చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం.