బోటీ కూర తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Samatha

11 April 2026

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. కొంత మంది చాలా ఇష్టంగా చికెన్ లేదా మటన్ తింటే, మరికొంత మంది మాత్రం ఫిష్, బోటీ లాంటివి తింటారు.

నాన్ వెజ్

కానీ కొందరు అసలు బోటీ తినడానికి ఇష్టపడరు. కానీ బోటీ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బోటీ

కాగా, ఇప్పుడు మనం బోటీ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు

బోటీలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బీ 12, ఐరన్, జింక్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.

విటమిన్స్ పుష్కలం

అందువలన కనీసం వారానికి ఒకసారి లేదా రెండు సార్లు బోటీ తినడం వలన రక్త హీనత తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

బోటీ తినడం వలన ఇది నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదంట.ఎవరు అయితే సరైన మోతాదులో బోటీ తింటారో, వారి మెదడు చాలా చురుకుగా పని చేస్తుందంట.

మెదడు పనితీరు

బోటీ కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో కొల్లాజెన్, జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.

జింక్

అందువలన బోటీ తినడం వలన ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

జుట్టు, చర్మం, కీళ్ల నొప్పులు