AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Vs Diabetes: స్వీట్లు మాత్రమేకాదు.. ఇప్పుడు ఉప్పు తిన్నా డయాబెటిస్‌ గ్యారెంటీ!

మధుమేహం ఉన్నవారికి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలని అందరూ సలహా ఇస్తుంటారు. కానీ మీకు తెలుసా ఉప్పు తిన్నా కూడా ఒంట్లో షుగర్ లెవల్స్‌ పెరుగుతాయట. అధిక ఉప్పు ఉండే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఉప్పు పదార్థాలు..

Salt Vs Diabetes: స్వీట్లు మాత్రమేకాదు.. ఇప్పుడు ఉప్పు తిన్నా డయాబెటిస్‌ గ్యారెంటీ!
Salt Intake Is Associated With Diabetes
Srilakshmi C
|

Updated on: Apr 12, 2026 | 5:12 PM

Share

ఎక్కువ చక్కెర, స్వీట్లు వంటి తీపి పదార్ధాలు తినడం వల్ల మధుమేహం వస్తుందని అందరూ అనుకుంటారు. అందుకే మధుమేహం ఉన్నవారికి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండమని సలహా ఇస్తుంటారు. కానీ మీకు తెలుసా ఉప్పు తిన్నా కూడా ఒంట్లో షుగర్ లెవల్స్‌ పెరుగుతాయట. అధిక ఉప్పు ఉండే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఉప్పు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పు పదార్థాలు తినడం వల్ల చక్కెర స్థాయిలను ఎలా పెంచుతాయో? ఆరోగ్యానికి ఏ ఆహారాలు ప్రమాదకరమో? మధుమేహ రోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు చక్కెర స్థాయిలను పెంచుతాయా?

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని అందరూ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. కొన్ని ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలలో అంతర్గతంగా చక్కెర ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

ఏ ఆహారాలు ప్రమాదకరమైనవి?

  • ప్యాకెట్ స్నాక్స్
  • చిప్స్
  • ఉప్పు బిస్కెట్లు

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వాటిలో చక్కెర, కార్న్ సిరప్, ప్రిజర్వేటివ్‌లను ఉపయోగిస్తారు. ఇవి ఉప్పగా ఉండే రుచిని ఇచ్చినప్పటికీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండాలి..

  • ప్యాకెట్‌పై చక్కెర శాతాన్ని తనిఖీ చేయాలి.
  • చక్కెర పదార్థాలను తక్కువగా తినాలి లేదంటే పూర్తిగా మానుకోవాలి.
  • ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల బీపీతోపాటు షుగర్‌ కూడా పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు

నిమ్మరసం, నారింజ వంటి తాజా పండ్లు శరీరానికి పోషకాలను అందించి, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. సాధారణంగా తీపి పదార్థాలే కాకుండా కొన్ని ఉప్పు పదార్థాలు కూడా చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందువల్ల మధుమేహ రోగులు తమ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us