AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ చెప్పిన చిట్కాతోనే ఇంత అందమా? బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన గ్లోబల్ బ్యూటీ

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు చోప్రా తన మెరిసే చర్మం వెనుక ఉన్న రహస్యాన్ని ఇటీవల పంచుకున్నారు. తాను ఎప్పుడూ ముఖానికి సోపు లేదా ఫేస్ వాష్ వాడలేదని, కేవలం ఈ సహజ సిద్ధమైన ఉబటన్ మాత్రమే వాడుతానని ఆమె వెల్లడించారు. ప్రియాంక చోప్రా కూడా తన చర్మ సౌందర్యం కోసం ఈ ప్యాక్‌నే నమ్ముతారట.

అమ్మ చెప్పిన చిట్కాతోనే ఇంత అందమా? బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన గ్లోబల్ బ్యూటీ
Priyanka Chopra.jpg
Nikhil
|

Updated on: Apr 13, 2026 | 6:40 AM

Share

ఆరోగ్యకరమైన చర్మం సరైన సంరక్షణతోనే సాధ్యమవుతుంది. ఇందుకోసం ఖరీదైన రసాయన ఉత్పత్తుల కంటే ప్రకృతి సిద్ధమైన ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. ఇవి చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా ముఖంపై ఉండే మొటిమలు, నల్లటి మచ్చలు, నిస్తేజాన్ని తొలగించి చర్మానికి కొత్త జీవం పోస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకునే డీఐవై (DIY) ప్యాక్‌లు చర్మంపై సున్నితంగా ఉంటూ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. శనగపిండి, పసుపుతో తయారయ్యే ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎలా పునరుజ్జీవింపజేస్తుందో తెలుసుకుందాం..

శనగపిండి-పసుపు ఫేస్ ప్యాక్

డాక్టర్ మధు చోప్రా ఒక వీడియో ద్వారా ఈ ప్యాక్ తయారీని దశలవారీగా వివరించారు. ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి తీసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఇందులో ఇంట్లో తయారు చేసిన మీగడ, ఒక చెంచా తాజా పెరుగు కలపాలి. ఆపై చర్మంపై ఇన్ఫెక్షన్లు, మొటిమలు రాకుండా నివారించే పసుపును చేర్చాలి. ఈ మిశ్రమాన్ని చిక్కగా చేయడానికి కొద్దిగా చల్లని పాలు పోసి బాగా కలపాలి. ఈ ప్యాక్ ముఖానికి రాసుకున్న 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే, అలసిపోయిన చర్మం వెంటనే తాజాగా మారుతుంది.

జాగ్రత్తలు

ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కళ్ల కింద అప్లై చేయకూడదని డాక్టర్ మధు హెచ్చరించారు. కళ్ల కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుందని, అక్కడ రుద్దడం లేదా ప్యాక్ వేయడం వంటివి చేయకూడదని సూచించారు. ఇది కేవలం పొడి చర్మం ఉన్నవారికి మాత్రమే కాకుండా, అందరికీ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఉత్తమ ఫలితాల కోసం ఈ ప్యాక్‌ను వారానికి ఏడు రోజులు వాడవచ్చని ఆమె సలహా ఇచ్చారు.

ఒకవేళ మీకు శనగపిండి పడకపోతే, దానికి బదులుగా గోధుమ పిండిని వాడుకోవచ్చు. పసుపు అలర్జీ ఉన్నవారు నిమ్మరసం ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే డైరీ ఉత్పత్తులు అంటే మీగడ, పాలు పడని వారు టొమాటో గుజ్జు లేదా బంగాళదుంప రసాన్ని కలుపుకోవచ్చు. ఈ సహజ సిద్ధమైన పదార్థాలు చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఖరీదైన బ్యూటీ పార్లర్లకు వెళ్లక్కర్లేకుండా ఇంట్లోనే ఈ చిట్కాతో మెరిసే అందాన్ని సొంతం చేసుకోవచ్చు.

Follow Us