AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokah Chapter 2: లోక చాప్టర్‌ 1 గురించి ఆ విషయం రివీల్‌ చేసిన మమ్ముట్టి

Lokah Chapter 2: లోక చాప్టర్‌ 1 గురించి ఆ విషయం రివీల్‌ చేసిన మమ్ముట్టి

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 6:33 PM

Share

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, తనయుడు దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'లోక' సీక్వెల్ గురించి సరదాగా మాట్లాడారు. మొదటి భాగంలో 'మూతాన్' పాత్రకు వాయిస్ ఇచ్చిన మమ్ముట్టి, సీక్వెల్‌లో నటించడానికి దుల్కర్‌కు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారు. తండ్రి కొడుకుల మధ్య ఈ చిలిపి సంభాషణ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. 'లోక 2'పై అంచనాలు పెరిగాయి.

కొన్నిసార్లు ఫ్యామిలీ పర్సన్స్ బయటికి వచ్చి చెప్పే మాటలు సరదాగా ఉంటాయి. వాళ్లు సరదాకే చెబుతున్నారని తెలిసినా, అందులో కాసింత చిలిపిదనం కూడా కనిపిస్తుంటుంది. అందులోనుంచే ఇంట్రస్ట్ క్రియేట్‌ అవుతుంటుంది. ఇప్పడు దుల్కర్‌ గురించి మమ్ముట్టి చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. లోక చాప్టర్‌ 1 మలయాళంలో ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో స్పెషల్‌గా మెన్షన్‌ చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే విషయం గురించి మంచి చర్చ జరుగుతోంది. సీక్వెల్‌ ఈ ఇయర్‌ ఎండింగ్‌లో స్టార్ట్ కావడం ఖాయం అంటూ కల్యాణి, టొవినో లీక్‌ చేసేశారు. ఇప్పుడు లోక సీక్వెల్‌ గురించి, అందులో మూతాన్‌ కేరక్టర్‌ గురించి స్ట్రాంగ్‌ క్లూ ఇచ్చేశారు మమ్ముట్టి. లోక చాప్టర్‌ 1లో మమ్ముట్టి మూతాన్‌ రోల్‌కి వాయిస్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రోల్‌కి తాను వాయిస్‌ ఇస్తున్నట్టు ముందు మమ్ముట్టికి తెలియదట. ఆ విషయాన్ని ప్రొడ్యూసర్‌ దుల్కర్‌ తనతో డిస్కస్‌ చేయనేలేదని చెప్పారు మమ్ముట్టి. దుల్కర్‌ ఫ్రెండ్‌, మేనేజర్‌ అప్రోచ్‌ అయితే వాయిస్‌ ఇచ్చానన్నది మమ్ముట్టి మాట. అయితే సినిమాలోని ఓ కేరక్టర్‌కి తన వాయిస్‌ని వాడారని, అందులో కనిపించే చేయి కూడా తనదేనని, ఇప్పుడు కచ్చితంగా సెకండ్‌ పార్టులో నటించాల్సి వస్తోందని చెప్పారు మమ్ముక్కా. తనయుడైనా సరే, తాను అడిగినంత రెమ్యునరేషన్‌ ఇస్తేనే లోకాలో నటిస్తానన్నది మమ్ముట్టి చెప్పే మాట. ఆఖరి శ్వాస వరకు కేరక్టర్లకు 100 శాతం న్యాయం చేయడమే తనకు నచ్చిన విషయమంటూ ఇటీవలే ఓపెన్‌ అయ్యారు మమ్ముక్కా. కొడుకు గురించి మలయాళ మెగాస్టార్‌ ఇష్టంగా మాట్లాడిన తీరు కేరళతీరాన్ని ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

Follow Us