AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ, ఫ్యాన్‌లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సమ్మర్‌లోనూ ఇల్లంతా కూల్ కూల్‌

సమ్మర్ వచ్చింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో 24గంటలు ఏసీ, లేదా ఫ్యాన్ కచ్చితంగా ఉండాల్సిందే.. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల నెల తిరిగే సరికి కరెంటు బిల్లు మనకు షాక్ ఇస్తుంది. కాబట్టి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే, ఏసీ , కూలర్, ఫ్యాన్ వంటివి లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Apr 12, 2026 | 6:10 PM

Share
రూప్‌టాప్‌కు పేయింటింగ్: సమ్మర్‌లో మీ ఇళ్లు చల్లగా ఉండాలంటే మీరు కచ్చితంగా రూప్‌టాప్‌కు కూట్ పెయింట్ వేయించుకోవాలి. ఎందుకంటే కాంక్రీట్ ఇళ్లు పగమంతా ఎండను పీల్చుకుని రాత్రిపూట వేడిని విడుదల చేస్తాయి. ఇంటి పైకప్పుకు కూల్ పెయింట్ వేయించుకోవడం, సాయంత్రం టెరస్‌పై నీళ్లను చల్లడం చేయండి, ఇలా చేయడం వల్ల ఇల్లు రూఫ్ చల్లబడుతుంది. అలాగే మీ దగ్గర పాత గోనె సంచుల ఉంటే వాటిని తడిపి పైకప్పుపై పరచడం వల్ల అవి ఎక్కువ సేపు తేమను పట్టి ఉంచి, లోపల ఉష్ణోగ్రత పెరగకుండా చేస్తాయి.

1 / 5
కిటికీల నిర్వహణ: ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కిటికీలు, తలుపులు మూసి ఉంచి మందపాటి తెరలు వేయాలి. దీనివల్ల బయట ఉండే వేడి గాలి లోపలికి రాదు. కిటికీ తెరలపై కొద్దిగా నీరు చల్లితే, బయటి నుండి వచ్చే గాలి ఆ తేమను తగిలి చల్లగా మారుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఇంటిని సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు.

2 / 5
మట్టి కుండలు: మట్టి కుండలు కేవలం నీటిని చల్లబరచడమే కాకుండా, గాలిలో తేమను కాపాడతాయి. కిటికీల దగ్గర నీటితో నిండిన మట్టి పాత్రలను ఉంచడం వల్ల సహజంగానే గది చల్లబడుతుంది. ఇది చాలా మందికి తెలియదు.

3 / 5
మొక్కల పెంపకం: ఇంట్లో మొక్కలను పెంచడం కూడా ఇంటి వాతావరనాన్ని చల్లగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంటి లోపల అలోవెరా, స్నేక్ ప్లాంట్ వంటి ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వల్ల అవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి.

4 / 5
వేసవి కాలంలో ఇంట్లో సాధారణ బల్బుల కంటే LED బల్బులను వాడటం మంచిది. ఎందుకంటే పాతకాలపు బల్బులు వెలుతురు కంటే వేడిని ఎక్కువగా విడుదల చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఎల్ఈడీ బల్బులు వాడేందుకు ప్రయత్నించండి. సమ్మర్‌లో ఈ చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా మీరు ఏసీ, ఫ్యాన్ లేకుండానే ఇంటిని చల్లబరుచుకోవచ్చు. అంతేకాదు ఇది కరెంటు బిల్లును కూడా ఆదా చేస్తుంది.

5 / 5
Follow Us