ప్రతి ఇంట్లో ఉండే పానియం.. గ్లాసుడు తాగితే ఆరోగ్యం మరింత భద్రం

12 April 2026

TV9 Telugu

TV9 Telugu

నిమ్మ రసం ఆహారానికి ప్రత్యేక రుచి, రంగుని తీసుకువస్తుంది. రుచికే కాదు నిమ్మరసం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం నిమ్మ అనేక లాభాల‌ను అందిస్తుంది

TV9 Telugu

నిమ్మర‌సాన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా నిమ్మర‌సాన్ని ప‌ర‌గ‌డుపునే సేవించ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ వ్యవ‌స్థ ఆరోగ్యంగా ప‌నిచేస్తుంది. జీర్ణ ర‌సాల ఉత్పత్తి మెరుగు ప‌డుతుంది

TV9 Telugu

పైత్య ర‌సాలు స‌క్రమంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది

TV9 Telugu

నిమ్మర‌సాన్ని సేవించ‌డం వ‌ల్ల గ్యాస్, క‌డుపు ఉబ్బరం, మ‌ల‌బ‌ద్దకం త‌గ్గిపోతాయి. నిమ్మర‌సాన్ని ఉద‌యం సేవిస్తుంటే శ‌రీరంలోని ద్రవాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి

TV9 Telugu

డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. రోజంతా బ‌య‌ట తిరిగేవారు లేదా ప‌నిచేసేవారు ఉద‌యం నిమ్మర‌సాన్ని సేవిస్తుంటే శ‌రీరంలోని నీరు బ‌య‌ట‌కు వెళ్లకుండా ఉంటుంది

TV9 Telugu

ఎల‌క్ట్రోలైట్స్ స‌మ‌స్థితిలో ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో వేడి చేర‌దు. శ‌రీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. దీంతో ఎండల వల్ల నీర‌సం, అల‌స‌ట రావు

TV9 Telugu

నిమ్మర‌సంలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీని వల్ల శ‌రీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధులు రాకుండా ర‌క్షిస్తుంది. మ‌న చ‌ర్మానికి నిమ్మర‌సం చేసే మేలు అంతా ఇంతా కాదు

TV9 Telugu

ఇందులో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వ‌ల్ల చ‌ర్మ కాంతి మెరుగు ప‌డుతుంది. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. చ‌ర్మ క‌ణాలకు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. య‌వ్వనంగా క‌నిపిస్తారు