ఎండల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరట్లేదా..? ఇది ట్రై చేయండి

12 April 2026

TV9 Telugu

TV9 Telugu

ఎండలు బాగా ముదురుతున్నాయి. వేడికి ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. వాటికి ప్రత్యామ్నాయంగానూ పోషకాలు అందుతాయనీ కొబ్బరినీళ్లు తాగుతుంటాం

TV9 Telugu

కొబ్బరినీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగొచ్చు. బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది

TV9 Telugu

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారికి కొబ్బరి నీళ్ల వల్ల నొప్పి ఎక్కువ కాకుండా ఉంటుంది. కురులకు ఎంతో ఆరోగ్యం.. కొబ్బరి నీళ్లతో జుట్టుకు బలం చేకూరుతుంది. ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది

TV9 Telugu

గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగటం ఎంతో ఆరోగ్యం. తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో లాభం చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేస్తాయి

TV9 Telugu

ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. ఎప్పుడైనా కడుపులో మంటగా అనిపిస్తే ఓ గ్లాసు  కొబ్బరి నీళ్లు తాగేయండి. తొందరగా ఉపశమనం కలుగుతుంది

TV9 Telugu

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కూల్‌ డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ పేరిట మార్కెట్‌లో అనేక రకాల పానీయాలను అమ్ముతున్నారు. వాటికి బదులు సహజసిద్ధంగా ఉండే ఆరోగ్యకరమైన కొబ్బరి నీళ్లను తాగటం మంచిది.

TV9 Telugu

తరచూ ఈ కొబ్బరి నీళ్లు తాగటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వీటిల్లోని కె, సి విటమిన్లు, మినరల్స్‌ కుదుళ్లకు పోషణను అందించి, జుట్టు పెరగడంలో సాయపడతాయి

TV9 Telugu

కొబ్బరి నీటిలో ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం అధికంగా ఉంటుంది. కొబ్బరి నీటిలో ఖనిజాల కంటే యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉంటాయి. అలాగే శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడంలోనూ కొబ్బరి నీళ్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి