మళ్లీ వచ్చారోయ్.. మాయదారి VIPS.. పేరు మార్చి మరో మోసానికి తెర..!
పేద మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డీ, పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు ఇస్తామంటే జనం గుడ్డిగా నమ్మేస్తారు. పెట్టిన ప్రతి రూపాయికి భారీ లాభం, అదనంగా క్యాష్ బ్యాక్, కమిషన్ల వర్షం ఇలాంటి మాయ మాటలతో అమాయక ప్రజలను నేరగాళ్ల బురిడీ కొట్టిస్తున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో జనానికి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ సంస్థ.. మరో రూపంలో జనాన్ని మోసం చేసేందుకు చేసిన ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు.

పేద మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డీ, పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు ఇస్తామంటే జనం గుడ్డిగా నమ్మేస్తారు. పెట్టిన ప్రతి రూపాయికి భారీ లాభం, అదనంగా క్యాష్ బ్యాక్, కమిషన్ల వర్షం ఇలాంటి మాయ మాటలతో అమాయక ప్రజలను నేరగాళ్ల బురిడీ కొట్టిస్తున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో జనానికి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ సంస్థ.. మరో రూపంలో జనాన్ని మోసం చేసేందుకు చేసిన ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు.
మూడేళ్ల క్రితం పూణే కేంద్రంగా ఎక్కువ లాభాలు ఆశ చూపి పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులు సేకరించిన VIPS సంస్థ ఆర్థిక మోసాలకు పాల్పడింది. VIPS గ్రూప్, గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్ రూ. 100 కోట్ల మేర పెట్టుబడి దారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. పుణె పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈ భారీ అక్రమ నగదు బదిలీల కేసును దర్యాప్తు చేస్తోంది. దుబాయ్ ఆధారిత ఈ సంస్థ యజమానికి సంబంధించిన రూ. 24.41 కోట్ల ఆస్తులను ED ఇప్పటికే జప్తు చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో జనానికి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన VIPS సంస్థ.. WAWE పేరుతో జనాన్ని మోసం చేసేందుకు పథకం వేసింది.
మహారాష్ట్రకు చెందిన వినోద్ తుకారాం ఖుటే 2016లో ప్రారంభించిన VIPS పేరుతో వాలెట్ డిజిటల్ యాప్ తో వందల కోట్ల స్కాంకు పాల్పడ్డాడు. ఈ యాప్ లో ప్రైమ్ మెంబర్ షిప్ గా చేరి రూ. 1995 కడితే రోజూ రూ.7 చొప్పున మొత్తం డబ్బులు వెనక్కివస్తాయని, అనేక ఆఫర్లు ప్రకటించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో సభ్యులుగా చేర్పిస్తే 5 లెవల్స్ వరకు కమిషన్ల వర్షం కురుస్తుందని ఊరించారు. నెలకు 5 శాతం వడ్డీ అంటూ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు,100 నెలల్లో 100 క్యాష్ బ్యాక్ అంటూ మాయ మాటలతో కోట్లాది రూపాయలు కుచ్చుటోపి పెట్టారు. ఆ తర్వాత ఈ సంస్థపై ఈడి కేసు నమోదుతో బాధితులంతా లబోదిబోమన్నారు.
మాయమాటలతో అమాయక జనాన్ని మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకున్న VIPS సంస్థ ముఠాకు ఆశ చావలేదు. మరో రూపంలో జనాన్ని మోసం చేసేందుకు పథకం వేశారు. WAVE పేరుతో డిజిటల్ మోసానికి సిద్ధమైంది గ్యాంగ్. వివిధ రకాల సేవల పేర్లతో ఆధిక లాభాలు, కాష్ బ్యాక్ ఆఫర్ అంటూ ఆన్ లైన్ లో విస్తృత ప్రచారం చేసింది. పాత బాధితులు వద్దకు వెళ్లి, “మీ పాత డబ్బులు రావాలంటే WAVE అనే కొత్త కంపెనీలో మరో లక్ష రూపాయలు పెట్టండి” అంటూ నల్గొండలోని ఓ ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన నల్గొండ రూరల్ పోలీసులు.. హైదరాబాద్, నల్లగొండ జిల్లాకు చెందిన 10 మంది ఏజెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుండి పది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు VIPS CEO వినోద్ తుకారాం ఖుటే, డైరెక్టర్లు సుమిత్ పురాంక్, కల్యాణ్ చక్రవర్తి, గుమ్మల సత్యనారాయణ, గుమ్ముల అభినాష్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసామని పోలీసులు చెబుతున్నారు. అధిక వడ్డీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అమాయక జనానికి కుచ్చుటోపి పెట్టే కేటుగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
