AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithisetty: లవ్‌లో ఫెయిలా.. కృతి శెట్టి ఏమన్నారు ??

Krithisetty: లవ్‌లో ఫెయిలా.. కృతి శెట్టి ఏమన్నారు ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 6:29 PM

Share

కృతి శెట్టి ప్రేమ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. '96', 'సీతారామం' సినిమాల్లోని ప్రేమ తనకు ఇష్టమని, నయనతార సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయన్నారు. కెరీర్‌లో 'ఐరన్ లెగ్' అన్న మాట బాధించిందని, అనిల్ రావిపూడి సినిమాతో అంతా సెట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఐదారేళ్లు కెరీర్‌పైనే దృష్టి పెట్టి, ఆ తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపారు.

తరాలు మారినా ఫ్రెష్‌గా వినిపించే పదం ప్రేమ. ప్రతి రెండు మనసులకు ప్రత్యేకంగా అనిపించే ఫీలింగ్‌ ఇది. కామన్‌ మేన్‌, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రేమకు సంబంధించి వారి మనసులోని భావాలను సమయం వచ్చినప్పుడు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు మన బేబమ్మ ప్రేమ గురించి మాట్లాడారు. తనకు నచ్చిన ప్రేమ ఎలా ఉంటుందో చెప్పారు? తాను ప్రేమను చూసే విధానం గురించి వివరించారు. ఇంతకీ 96 గురించి ఈ లేడీ ఎందుకు ప్రస్తావించారు? ఉప్పెన సినిమా తర్వాత పర్ఫెక్ట్ లవ్‌ స్టోరీ చేశామన్న ఫీలింగ్‌ ఇప్పటిదాకా రాలేదట కృతి శెట్టికి. లవ్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీలో నటించాక ఆ ఫీలింగ్‌ వచ్చిందంటున్నారు. ఈ సినిమా జస్ట్ కెరీర్‌లో ఇంకో సినిమా కాదని, నయనతారలాంటి సీనియర్‌తో సన్నిహితంగా ఉండే అవకాశాన్ని కల్పించిందని అంటున్నారు. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి నయన్‌ ఇచ్చిన అడ్వైజ్‌లు కూడా చాలానే ఉపయోగపడ్డాయన్నది కృతి చెబుతున్న మాట. కృతి ఆల్రెడీ ప్రేమలో ఫెయిల్‌ అయ్యారా? అంటే… నో వే! అదేదో గేమ్‌లో భాగంగా చెప్పిన మాట. ఇంకో ఐదారేళ్లు నేను ప్రేమ ఊసు తీసుకురాను. కెరీర్‌లో పీక్స్ చూశాక, పెళ్లి గురించి ఆలోచిస్తే. ఎవరినైతే ప్రేమిస్తానో, డేట్‌ చేస్తానో.. వాళ్లతోనే పెళ్లి. ఏదైనా మా అమ్మకు డే ఒన్‌ నుంచి చెప్పే చేస్తానంటున్నారు ఈ లేడీ. లోకం ఎంత ఫాస్ట్ గా మారినా 96 మూవీలో చూపించిన ప్రేమ, సీతారామమ్‌లో ఫీలైన ప్రేమ తన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉంటుందంటారు కృతి. ఈ సినిమాల్లోలాగా ప్రేమలో ఫీల్‌ ఉండాలని, తాను అలాంటి ప్రేమలనే ఇష్టపడతానని చెబుతున్నారు. తమిళ్‌ సినిమాల్లోనే సెటిల్‌ అవుతారా అని అడిగితే ‘అలాంటిదేమీ లేదు. తెలుగు నా మనసుకు దగ్గరగా ఉంటుంది. ఎందుకో సరైన సక్సెస్‌లు రాలేదు. అందులో నా తప్పేం ఉంది? అంత మాత్రానికే ఐరన్‌ లెగ్‌’ అని అంటే ఎలా అని బాధపడుతున్నారు కృతి. అంతే కాదు, నెక్స్ట్ అనిల్‌ రావిపూడి సినిమాతో అంతా సెట్‌ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తు్న్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

Follow Us