Gold Prices: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఏకంగా రూ.3 వేలు పతనం.. రాత్రికి రాత్రి ఢమాల్
సోమవారం బంగారం ధరల్లో ఊహించని భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం ఒకలా ఉన్న ధరలు.. సాయంత్రానికి ఒకేసారి రూ.3 వేలు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరల పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత వారంలో భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు.. ఈ వారం ఒక్కసారిగా పతనమవుతూ వస్తోన్నాయి. వేలకు వేలకు బంగారం ధర తగ్గతూ కొనుగోలుదారులకు ఉపశమనం కల్పిస్తోంది. సోవారం ఉదయం ధరలు ఒకలా ఉండగా.. సాయంత్రం కల్లా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. న్యూ ఇయర్ వస్తున్న క్రమంలో పసడి ధరలు తగ్గుతున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం ఒక్కసారిగా బంగారం ధరల్లో భారీ మార్పులు చేటుచేసుకున్నాయి.
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన గోల్డ్
డిసెంబర్ 29న సాయంత్రం బంగారం ధర ఉన్నట్లుండి ఒకేసారి రూ.3 వేలు తగ్గింది. సోమవారం ఉదయం తులం బంగారంపై కేవలం రూ.650 మాత్రమే తగ్గగా.. సాయంత్రానికి ఏకంగా రూ.2900 తగ్గింది. దీంతో ఇవాళ మొత్తం రూ.3170 తగ్గినట్లు అయింది. తగ్గిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,39,250గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,42,420 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు సాయంత్రం రూ.2900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,27,650 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో ఇలా..
అటు చెన్నైలో బంగారం రేట్లు ఎక్కువగా తగ్గలేదు. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,040గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,42,910 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోలిస్తే కేవలం రూ.870 మాత్రమే తగ్గుముఖం పట్టింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,200గా ఉంది. ఆదివారం ఈ ధర రూ.1,31,000గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే రూ.800 తగ్గిందని చెప్పవచ్చు.
