మీకు ఇక ఒక్కరోజే గడువు.. ఈ పని చేయకపోతే కొత్త సంవత్సరంలో సమస్యలే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు అందరూ ఉత్సాహం చూపుతున్నారు. అయితే నూతన సంవత్సరం వస్తుందంటే.. అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్నింటికి గడువు ముగుస్తూ ఉంటుంది. అందులో ఒకటి ఆధార్-పాన్ లింక్. దీనికి డిసెంబర్ 31తో డెడ్ లైన్ ముగియనుంది. లింక్ చేసుకోకపోతే ఇబ్బందులే.

PAN Card Link: ఆధార్-పాన్ లింకింగ్‌కు డిసెంబర్ 31తో గడువు ముగియనుంది. ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో ఇంకా చేసుకోనివారు వెంటనే చేసుకోవడం మంచిది. లేకపోతే జనవరి 1వ తేదీ నుంచి మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశముంది. లేదా పాన్ కార్డును ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇనాక్టివ్ చేసే అవకాశముంది. అంతేకాకుండా డిసెంబర్ 31లోపు చేసుకోకపోతే మీరు రూ.10 వేల వరకు కూడా జరిమానా కట్టాల్సి రావొచ్చు. లింక్ చేసుకోకపోతే ఇలా మీరు ఎన్నో ఇబ్బందులను కొత్త ఏడాది నుంచి ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసుకోనివారు వెంటనే ఆ పని చేసుకోవాలి.
ఇవి రద్దయ్యే అవకాశం
ఆధార్ కార్డుతో పాన్ కార్డును డిసెంబర్ 31 వరకు రూ.వెయ్యి ఫైన్ చెల్లించి లింక్ చేసుకోవచ్చు. అప్పటిలోగా లింక్ చేసుకోకపోతే భారీగా జరిమానా విధించవచ్చు. ఇప్పటికే అనేకసార్లు ఇందుకు గడువు పొడిగించగా.. ఈ సారి పెంచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో లింక్ చేసుకోవారి తమ పాన్ కార్డుల సేవల్లో అంతరాయం ఎదుర్కొనే అవకాశముంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమస్యలు ఎదరయ్యే ఛాన్స్ ఉంది. అలాగే టీడీఎస్, టీసీఎస్ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా.. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా వీలు పడదు. అలాగే కొత్తగా డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా మీరు అందుకోలేరు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టలేరు.
ఎలా లింక్ చేసుకోవాలంటే..?
-www.incometax.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి -లింక్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోండి -మీ ఆధార్, పాన్ నెంబర్లు ఎంటర్ చేయండి -మీ పేరు ఎంటర్ చేయండి -I Agree చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి రూ.వెయ్యి చెల్లించండి -ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకుని వివరాలు ఇవ్వండి -కంటిన్యూపై క్లిక్ చేస్తే చలాన్ జనరేట్ అవుతుంది -ఆ తర్వాత మళ్లీ లింక్ ఆధార్ సెక్షన్‌కు వచ్చి పాన్, ఆధార్ వివరాలు ఇవ్వాలి -ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది
