ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఫలితాలు చూస్తే షాక్ అవుతారు..
కరివేపాకు నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది., మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి జుట్టు, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకునే వారికి కరివేపాకు నీరు ఒక దివ్యౌషధం.

మన వంటగదిలో పోపు పెట్టాలన్నా, వంటకానికి మంచి సువాసన రావాలన్నా కరివేపాకు ఉండాల్సిందే. అయితే కరివేపాకు కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దానిలో దాగి ఉన్న పోషకాలు ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు మరిగించిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులను దూరం పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియకు దివ్యౌషధం
కరివేపాకు నీరు శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది ఒక సహజ సిద్ధమైన పరిష్కారం.
మధుమేహం – కొలెస్ట్రాల్ నియంత్రణ
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు నీరు ఒక వరం లాంటిది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి..
శరీరంలోని మెటబాలిజంను పెంచడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడమే కాకుండా శరీర బరువును ఆరోగ్యకరంగా తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ మార్నింగ్ డ్రింక్‌గా దీనిని ఎంచుకోవచ్చు.
జుట్టు – చర్మ సౌందర్యం
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ తో పాటు ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు మందంగా, బలంగా పెరిగేలా చేస్తుంది. ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్, పొడి చర్మం సమస్యలకు కరివేపాకు నీరు చక్కటి పరిష్కారం. ఇది చర్మ రంగును మెరుగుపరిచి మెరిసేలా చేస్తుంది.
ఎలా తయారు చేయాలి?
కొన్ని తాజా కరివేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక వడకట్టుకుని పరగడుపున తాగాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




