AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaye Khanna : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ధురంధర్ సాంగ్.. ఇంతకీ ఆ పాట అర్థమేంటో తెలుసా..?

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం తెగ ట్రెండ్ అవుతుంది. అలాగే పలు పాటలు సైతం నెట్టింటిని షేక్ చేశాయి. గత రెండు మూడు నెలలుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాయిలోనా బల్లిపలికే, రాను బొంబాయికి రాను, పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్స్ సోషల్ మీడియాను అల్లాడించేశాయి. ఇక ఇప్పుడు మరో సాంగ్ నెట్టింటిని ఊపేస్తుంది.

Akshaye Khanna : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ధురంధర్ సాంగ్.. ఇంతకీ ఆ పాట అర్థమేంటో తెలుసా..?
Akshaye Khanna
Rajitha Chanti
|

Updated on: Jan 02, 2026 | 10:13 PM

Share

స్తుతం సోషల్ మీడియాను ధురంధర్ సినిమ సాంగ్ షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన అదే పాట మారుమోగుతుంది. ఇక ఇన్ స్టాలో ప్రతి పది రీల్స్ లో నాలుగైదు అక్షయ్ ఖన్నా ఎంట్రీ వీడియోస్ ఉంటున్నాయి. దాదాపు 50 సంవత్సరాల వయస్సులో కూడా, నటుడు అక్షయ్ ఖన్నా తన అద్భుతమైన నటనతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇన్నాళ్లుగా హీరోగా అలరించిన అక్షయ్ ఖన్నా.. ధురంధర్ సినిమాతో విలన్ గా ఇరగదీశాడు. ఛావా సినిమాలో విలన్ పాత్ర పోషించిన తర్వాత ఆ తర్వాత ధురంధర్ సినిమాతో మరోసారి అలరించాడు. ఇదెలా ఉంటే.. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన డ్యాన్స్, స్వాగ్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ‘ఫా9లా’ పాటలోని క్రేజీ ట్యూన్, అక్షయ్ ఖన్నా తనదైన రీతిలో డ్యాన్స్ చేయడం మరింత హైలెట్ అయ్యింది.

ఇప్పుడు పాట భాష ఎవరికీ అర్థం కాకపోయినా అందరూ స్టెప్పులేస్తున్నారు. ఫా9లా అనేది బహ్రెయిన్ గాయకుడు రాపర్ ఫ్లిపెరా పాడిన పాట. ఈ సాంగ్ గొప్ప బాస్‌లైన్, గొప్ప బీట్స్, అరబిక్ ర్యాపింగ్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా మొదటి గ్లింప్స్ చూసిన వెంటనే ప్లే అయ్యే ఈ పాట, ‘పెద్దదానికంటే పెద్ద’ జీవిత అనుభవాన్ని ఇస్తుంది. ఈ పాట సరదా, ఉత్సాహం, ఉత్సాహం మరియు ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. చుట్టుపక్కల ప్రజలు పూర్తి శక్తితో డ్యాన్స్ చేయడానికి.. ప్రోత్సహించడానికి ఉపయోగించే సాంగ్.

Song Lyrics :

“యాఖీ దూస్ దూస్ 3ఇండి ఖోష్ ఫస్లా యాఖీ తఫూజ్ తఫూజ్ వల్లా ఖోష్ రక్ష 3ఇండి లక్ రక్ష కవియా యా అల్-హబీబ్ ఇస్మాహా సబుహా ఖత్భా నసీబ్ మిడ్ యాదక్ జింక్ బిటా3తిహా కాఫ్ వా హెజ్ జిత్‌ఫిక్ 7ఈల్ ఖల్లిక్ షాదీ”..

అర్థం..

“ఫ్రెండ్స్, గట్టిగా డ్యాన్స్ చేయండి… ఈ రోజు నేను చాలా సరదాగా గడపాలనుకుంటున్నాను. ఓహ్, పక్కకు తప్పుకోండి, నేను దేవుడితో ప్రమాణం చేస్తున్నాను, అందంగా డ్యాన్స్ చేద్దాం. నా దగ్గర నీ కోసం ఒక శక్తివంతమైన అడుగు ఉంది, ఫ్రెండ్… ఆమె పేరు సబుహా, విధి ఈ అడుగును నీ కోసమే వేసింది, నీ చేతులు పైకెత్తి పట్టుకో… నీ భుజాలను గట్టిగా ఊపండి, కానీ బలంగా ఉండు… ”

ఈ పాట టైటిల్‌లో 9 నంబర్‌ను ఎందుకు ఉపయోగించారనే దానిపై రచయిత అజిత్ వాడ్నేర్కర్ కూడా ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. హిప్ హాప్ ప్రపంచం నుండి నేరుగా హిట్ అయిన ఈ పాట అసలు పేరు ‘ఫస్లా’. ఈ పాట బలూచ్ గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ దకైట్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..