కల్లలవుతున్న డాలర్ డ్రీమ్స్.. ఏ క్షణాన్నయినా ఏ కార్డయినా.. రద్దయే ప్రమాదం..!
ఎఫ్1 వీసాదారుల కష్టాలు ఇలా ఉంటే.. ఉద్యోగం చేస్తూ H1B వీసాలు తీసుకుని స్థిరపడ్డ తెలుగోళ్ల పరిస్థితి మరింత అగమ్యగోచరం. అమెరికాలో జారీ అయ్యే హెచ్1బీ వీసాల్లో 78 శాతం మనోళ్లవే. తర్వాత గ్రీన్‌కార్డు తెచ్చుకోడానికి దీన్ని ప్రధాన ఆధారంగా వాడుకుంటారు. ప్రస్తుతం 3 లక్షల 20 వేల మంది భారతీయులు హెచ్1బీ వీసాతో అమెరికాలో ఉంటున్నారు. కానీ.. ట్రంప్ సెకండ్ టర్మ్ స్టార్టయ్యాక వీళ్లక్కూడా సినిమా కష్టాలు స్టార్టయ్యాయి. ఉద్యోగాలకు భద్రతన్నదే కరువైపోయింది.

ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినతరం, ఊడుతున్న ఉద్యోగాలు, అక్రమ వలసదారుల ఏరివేత, ప్రత్యేక విమానాల్లో పంపివేత, అమెరికా సరిహద్దు గోడ దూకుతూ భారతీయుడి మృతి..! అగ్రరాజ్యంలో మనోళ్ల సినిమా కష్టాలపై ఇలా వరుసబెట్టి వస్తున్న వార్తలకు పరాకాష్ట ఏంటంటే.. అమెరికాలో అప్పుల బాధ తట్టుకోలేక, మానసిక ఒత్తిడి భరించలేక గుడివాడ విద్యార్థి ఆత్మహత్య. మనోళ్ల డాలర్ డ్రీమ్స్ బద్దలైపోతున్నాయనడానికి ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? టౌన్ పక్కకెళ్లొద్దురా.. డౌనైపోతావురా అని నెత్తీనోరూ బాదుకున్నా ఎవ్వరి చెవికీ ఎక్కలేదు. ఏ బంగారు సామీ విన్న పాపాన పోలేదు. అమెరికా టౌన్ మీద మోజు పెంచుకుని.. చదివితే అక్కడే చదవాలని ఉద్యోగం చేస్తే అక్కడే చెయ్యాలని అప్పుడు కన్న డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు ఒక్కటొక్కటిగా బద్దలైపోతున్నాయి. ఎదర బతుకంతా చిందరబందరే అని జ్ఞానోదయాలయ్యాక నిద్ర మత్తు వదిలించుకుని కొద్దికొద్దిగా రియాలిటీలోకి వస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని చించిపారేసి కొత్తకొత్త రూళ్ల కర్రతో బాదేస్తున్న ట్రంప్ ఐడియాలజీ మనోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. అమెరికా ఆశల్లో తేలియాడిన లక్షలాదిమంది భారతీయులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ లివింగ్ కండిషన్లు, బెటర్ మనీ, బెటర్ ఆపర్చునిటీస్ కోసం మనోళ్లు ఆశగా చూసే దేశాలు యూకే, యూఎస్. ఆస్ట్రేలియా, కెనడా. ఏటా 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటే.. అందులో మన తెలుగువాళ్లే ఎక్కువ. ఆ తెలుగువాళ్లలో కూడా అమెరికా టూరేసేవాళ్లే ఎక్కువ. ఇప్పుడు అమెరికాలోనే వీళ్ల ఆశలన్నీ అడ్డం...